'సోనియా'ఓటర్ల నిరాసక్తత
రాయబరేలి పట్టణం కోసం సోనియా గాంధి చేపట్టిన పథకాల గురించి పార్టీ నాయకుడు వివరిస్తూ, రాజీవ్ గాంధి గ్రామీణ విద్యుదీకరణ పథకం (ఆర్ జిఆర్ఇపి) వాటిలో ఒకటని చెప్పారు. ఇది గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని ఆయన చెప్పారు.'ఆమె ఎన్ టిపిసి నుంచి రాయబరేలికి నేరుగా విద్యుత్ సరఫరాను సాధించారు. నియోజకవర్గంలో రూ. 75 కోట్ల ఖర్చుతో 220/132 కెవి సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేయించారు. ఐటిఐకి రూ. 321 కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటింపచేసి, రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు' అని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా, పోలింగ్ కేంద్రాలకు తక్కువ సంఖ్యలో జనం రావడానికి ప్రధాన కారణం సోనియాకు గట్టి పోటీ లేకపోవడమేనని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. 'ఆమె ఎలా అయినా గెలుస్తారని వారికి తెలుసు. 2006 ఉప ఎన్నికలలో తక్కువ ఓటింగ్ నమోదైనప్పటికీ సోనియా గాంధి రికార్డు స్థాయిలో4,74,891 ఓట్ల మెజారిటీని సాధించారు' అని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. 'ఈ దఫా ఆమె తన రికార్డునే బద్దలు కొట్టగలరు' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Pages: -1- 2 News Posted: 1 May, 2009
|