యువరాజ్ హ్యాట్రిక్ నిష్ఫలం!
విజయం సాధించడానికి 146 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు యువరాజ్ సింగ్(50), గోయెల్(20) తప్ప మిగిలినవారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. సైమన్ కటీచ్(రనౌట్)3, కుమార సంగక్కర 17, మహేల జయవర్దన 19, ఇర్ఫాన్ పఠాన్ 12, చావ్లా 3 పరుగులు చేయగా పొవార్, శ్రీవాస్తవ డకౌట్ అయ్యారు. బెంగుళూరు బౌలర్లలో ప్రవీణ్ 2, మెర్వ్ 2, కుంబ్లె 2 వికెట్లు పడగొట్టారు. హ్యాట్రిక్ తోపాటు 34 బంతుల్లో 3 ఫోర్లి, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Pages: -1- 2 News Posted: 1 May, 2009
|