జ్యోతిష్కులతో సందిగ్ధం
అయితే, టిడిపి 165 శాసనసభ సీట్లు, మహా కూటమికి 199 సీట్లు లభిస్తాయని చంద్రబాబుతో మోహనరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 54, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి 26, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు 20 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆయన సూచించారు. టిడిపి 18 లోక్ సభ సీట్లను గెలుచుకోగలదని, కాంగ్రెస్ 15 సీట్లను దక్కించుకోగలదని, టిఆర్ఎస్, వామపక్షాలకు ఆరు సీట్లు, పిఆర్పీకి రెండు సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు రాగలవని మోహనరెడ్డి చెప్పారు. టిడిపి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, ప్రమాణ స్వీకారానికి మే 22 దివ్యమైన ముహూర్తమని శుక్రవారం ఉదయం చంద్రబాబుతో మోహనరెడ్డి చెప్పినప్పుడు టిడిపి గెలుచుకునే సీట్ల సంఖ్య ఎంతో చెప్పాలని చంద్రబాబు కోరారు. 'టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని నాకు తెలుసు. కాని ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి' అని మోహనరెడ్డితో చంద్రబాబు అన్నట్లు తెలుస్తున్నది.
కాగా, 2004 ఎన్నికలలో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని మోహనరెడ్డి చెప్పిన జోస్యం నిజం కాని సంగతి విదితమే. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలగడంపై కొందరు జ్యోతిష్కులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం శని మహా దశలో శుక్ర ఉప దశ నడుస్తున్నదని, దీని వల్ల చంద్రబాబుకు అధికారం లభించకపోవచ్చునని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమనేది ఆయన స్నేహితుడు కె. చంద్రశేఖరరావుపై పూర్తిగా ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే, చంద్రశేఖరరావు జాతక చక్రంలో శని రెండవ ఇంట ఉన్నాడని, రెండవ ఇల్లు 'వాక్ స్థానానికి' ప్రాతినిధ్యం వహిస్తుందని, అందువల్ల కెసిఆర్ చేసే మింగుడుపడని వ్యాఖ్యలు మహా కూటమి అవకాశాలను దెబ్బ తీయగలవని కొందరు జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 2 May, 2009
|