లాలూకు మిత్రులే ప్రత్యర్థులు
లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోవలసి వచ్చినప్పుడు రంజన్ ఆయనకు వారసుడు కాగలరని రంజన్ మద్దతుదారులు ఆశించారు. కాని లాలూ తన స్థానంలో తన భార్య రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించారు. ఆతరువాత కొద్ది కాలానికే, రంజన్ ను ఆర్ జెడి నుంచి బహిష్కరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి)లో రంజన్ చేరి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అయ్యారు. అయితే, ఈ సంవత్సరం ఎన్నికలలో సంఘటితంగా పోటీ చేసేందుకు లాలూతో పాశ్వాన్ చేతులు కలిపినప్పుడు రంజన్ ఎల్ జెపికి రాజీనామా చేసి జెడి (యు)లో చేరారు. 'ఆర్ జెడి అధినేత లాలూ ప్రసాద్ వంటి అభివృద్ధి నిరోధకుడు గతంలో మీ పట్ల వ్యవహరించిన తీరును మరచిపోయి ఆయనతో మీరు చేతులు కలిపినట్లయితే చివరకు మీరు ఒక్కరే మిగిలిపోతారు. లాలూ బీహార్ కు చేసిన అన్యాయాన్ని చూసిన తరువాత ఎల్ జెపి - ఆర్ జెడి కూటమిలో భాగస్వామిని కావడానికి నా అంతరాత్మ ఒప్పుకోదు' అని రంజన్ ఫిబ్రవరిలో పాశ్వాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ సింగ్ యాదవ్ కూడా ఒకప్పుడు లాలూకు సన్నిహిత సహచరుడు. లాలూ పాటలీపుత్ర, శరణ్ స్థానాల నుంచి పోటీ చేయగలరని ముందు ప్రకటించింది విజయ్ సింగే. అయితే, లాలూపై పోటీకి దిగడానికి విజయ్ ను పురికొల్పిన కారణం ఏమిటనేది మిస్టరీయే.
Pages: -1- 2 News Posted: 4 May, 2009
|