కృష్ణాలో అంతా కాయ్ రాజాలే!
పెనమలూరుతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా బెట్టింగులు భారీగా జరిగాయి. ఒకానొక దశలో అభ్యర్ధులే తమ తరఫున కార్యకర్తలను రంగంలోకి దించి బెట్టింగులు జరుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటింగు సరళి మరింత ఉత్కంఠను రేపింది. ఇక్కడ ఏ అభ్యర్ధి విజయం సాధిస్తారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నాయకులు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం సాగించారు. వరుసగా ఏడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేవినేని రాజశేఖర్ విజయం సాధిస్తారా లేక తెలుగుదేశం మిగతా రెండు పార్టీల అభ్యర్ధుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అనే విషయమై 5 కోట్ల రూపాయలకు పైనే బెట్టింగులు జరిగినట్టు తెలిసింది.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నిక కూడా ఆసక్తికరంగా మారింది. పోలింగ్ జరిగిన వెంటనే ఎంపి లగడపాటి రాజగోపాల్ ఇక్కడి నుంచి వెళ్లిపోయి, హైదరాబాద్, ఢిల్లీలకే పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో క్రాస్ ఓటింగు జరిగినట్టు కార్యకర్తలు గ్రహించారు. తమ పార్టీకి రావలసిన ఓట్లు తెలుగుదేశం అభ్యర్ధికి పడ్డాయని ప్రజారాజ్యం అభ్యర్ధి చనుమోలు రాజీవ్ బాహాటంగానే చెబుతున్నారు. అయితే తన గెలుపు ఖాయమని, ఎంత మొత్తమైనా పందెం కాయవచ్చని లగడపాటి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆయన విజయంపై సుమారు 9 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్టు కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఇదే విధంగా మచిలీపట్నంలో బూరగడ్డ వేదవ్యాస్, విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా విజయాలపై కూడా కొట్లాది రూపాయల బెట్టింగ్ జరిగిందట!
Pages: -1- 2 News Posted: 4 May, 2009
|