కెసిఆర్ కరుణకై తంటాలు
ఎన్నికల ప్రచార సమయంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు గతంలో వలె కాకుండా ప్రత్యేక తెలంగాణ గురించి తక్కువగా ప్రస్తావించి, టిడిపి నగదు బదలీ, రంగుల టివి పథకాల గురించే ఎక్కువగా మాట్లాడారు. కాని ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన ఒక వైపు ఎన్నికల అనంతర పొత్తుకు మార్గాలను అన్వేషిస్తూనే మరొకవైపు ఆ పథకాలు ఎంత వరకు జనాన్ని ఆకట్టుకుని ఉంటాయనే అనుమానాలు వ్యక్తం చేయసాగారు.
'ప్రత్యేక తెలంగాణ మా అజెండాలో అగ్ర ప్రాధాన్యం ఉన్న అంశం. తెలంగాణపై ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం' అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పారు. అంటే టిఆర్ఎస్ తృతీయ ఫ్రంట్ లో కొనసాగకపోవచ్చునని, కేంద్రంలో కాంగ్రెస్ కు లేదా బిజెపికి మద్దతు ఇవ్వడానికి కూడా ఆ పార్టీ సిద్ధమని విదితమవుతున్నది. టిఆర్ఎస్ తాజా వైఖరిని కూడా టిడిపి అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నది. 'టిఆర్ఎస్ కేంద్రంలో ఎన్ డిఎకు మద్దతు ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కాని రాష్ట్రంలో అది మహా కూటమిలో కొనసాగుతుంది' అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు. 'ఎన్ డిఎకు మద్దతు అందజేయడమనేది టిఆర్ఎస్ అధినేత వ్యక్తిగత అభిప్రాయం. టిఆర్ఎస్ మహా కూటమిలో కొనసాగుతుంది' అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
టిడిపి ఎంతగా సర్దుబాటు ధోరణి కనబరుస్తున్నా టిడిపి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరడానికి టిఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పదవిని లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని కోరే అవకాశం ఉన్నది.
Pages: -1- 2 News Posted: 5 May, 2009
|