పోస్టల్ బ్యాలట్లపై కన్ను
కడప, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్క పోస్టల్ బ్యాలట్ కు ధర రూ. 2000, రూ. 2500 మధ్య ఉంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఒక మంత్రి ప్రతి పోస్టల్ బ్యాలట్ కు రూ. 5000 ఇవ్వజూపుతున్నట్లు తెలుస్తున్నది. 'ప్రతి ఓటూ ముఖ్యమైనదే. 2004లో టిడిపి అభ్యర్థి ఒకరు 150 కన్నా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు' అని అనంతపురం జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి చెప్పారు. అయితే, నగదుగా కాకుండా ఇతర రూపాలలో కూడా ప్రతిఫలాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. 'పోస్టల్ బ్యాలట్లు ఉన్న అనేక మంది ఓటర్లను బదలీల వాగ్దానాలతో ప్రలోభపెడుతున్నారు' అని ఒక టీచర్ చెప్పారు. తనకు ఇష్టమైన ప్రదేశానికి బదలీ చేస్తామనే వాగ్దానంపై తన పోస్టల్ బ్యాలట్ ను ఒక అభ్యర్థికి వేసినట్లు ఆ టీచర్ అంగీకరించారు.
మామూలు ఓటు విషయంలో వలె కాకుండా పోస్టల్ బ్యాలట్ ను అభ్యర్థులు కచ్చితంగా నమ్ముకోవచ్చు. మామూలు ఓటు విషయంలో ఓటరు కానుక తీసుకున్న తరువాత తన వాగ్దానాన్ని పాటిస్తారనే నమ్మకం ఉండదు. 'ఎవరైనా ఓటర్ ఒక కారణంపై ఓటు వేయడానికి అంగీకరిస్తే ఆ ఓటర్ నా సమక్షంలోనే ఓటు ముద్ర వేసి దానిని నాకు అందజేస్తారు. మేము ఆతరువాత దానిని ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో గల డ్రాప్ బాక్స్ లలో వేస్తాం లేదా ఇసికి నేరుగా పోస్ట్ లో పంపుతాం. పోస్టల్ బ్యాలట్ విషయంలో మాకు ఓటు పడిందనే భరోసా ఉంటుంది' అని ఒక అభ్యర్థి తెలిపారు.
Pages: -1- 2 News Posted: 5 May, 2009
|