రెండులో ఒక్కదానికే ఓటు
రెండు ఇవిఎంలు ఉన్నాయని, ఒకటి లోక్ సభకు, రెండవది శాసనసభకు ఉద్దేశించినవని, తన ఓట్లు వేయడానికి ఆ రెండింటి బటన్లను నొక్కవలసి ఉంటుందని ఓటర్ కు సుబోధకం చేయడం ప్రిసైడింగ్ అధికారి కర్తవ్యం. 'అయితే, లోక్ సభ, శాసనసభ రెండింటిలో ఒకదానికి ఓటు వేయరాదని ఓటర్ నిర్ణయించుకున్నట్లయితే అది సదరు ఓటర్ హక్కు అని, అధికారులు రెండు ఓట్లు వేయవలసిందిగా ఓటర్ ను బలవంత పెట్టజాలరు' అని ఆ అధికారి స్పష్టం చేశారు.
ఇసి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మొత్తం 5.78 కోట్ల మంది ఓటర్లలో 4.1 కోట్ల మంది అంటే 72.26 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని విదితమవుతున్నది. లోక్ సభ ఎన్నికలలో నరసాపురంలో అత్యధికంగా 84.21 శాతం, మల్కాజ్ గిరిలో అతి తక్కువగా 51.28 శాతం ఓట్లు నమోదయ్యాయి.
అయితే, కొందరు విశ్లేషకులను ఈ పరిణామం ఏమాత్రం ఆశ్చర్యపరచడం లేదు. 'గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ జరిగేది హైదరాబాద్ లో ప్రభుత్వం కోసమేనని భావించారు. వారి దృష్టిలో ఢిల్లీ లేదు. అందువల్ల అనేక మంది మహిళలు లోక్ సభకు ఓట్లు వేసి ఉండకపోవచ్చు' అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. 'అయితే, నిజంగా చెప్పాలంటే పురుషులు అసెంబ్లీకి ఓట్లు వేయకపోవడం నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఇది గణాంకాల సంకలనంలో పొరపాటు కావచ్చునని నా భావన' అని ఆ విశ్లేషకుడు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 6 May, 2009
|