డి బ్లాకే అక్రమ కట్టడం!
మునిసిపల్ కార్పొరేషన్ నుంచి ముందుగా అనుమతి కోరకుండా నిర్మించిన ప్రభుత్వ భవనాలు సుమారు 15 ఉన్నాయి. అక్రమంగా నిర్మించిన, అగ్నిమాపక శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఒసి)ని పొందని ప్రభుత్వ శాఖల జాబితాను 2006లో హైకోర్టుకు అందజేశారు. మరీ ఎత్తైన భవనాలలో అగ్నిప్రమాద నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలకు సంబంధించిన ఒక కేసులో కోర్టుకు ఈ జాబితా సమర్పణ జరిగింది. ఆ భవనాలలో హైకోర్టు అనెగ్జి, బషీర్ బాగ్ లో పోలీస్ కమిషనర్ కార్యాలయం, హైదర్ గూడలో ఎంఎల్ఎ క్వార్టర్స్ లో కొత్త బ్లాక్, హిమాయత్ నగర్ లో ఎపి హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం, అరణ్య భవన్, లక్డీకాపూల్ లో డిజిపి కార్యాలయం, లక్డీకాపూల్ లోనే ఇంటలిజెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్, ఎసి గార్డ్స్ లో సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ కార్యాలయం, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ కార్యాలయం, పురపాలక శాఖ డైరెక్టర్ కార్యాలయం, గ్రీన్ లాండ్స్ లో పర్యాటక భవన్, యూసుఫ్ గుడా స్టేడియం, ఖైరతబాద్ లో కొత్త ఆర్ టిఎ కార్యాలయం, నాంపల్లిలో హజ్ కాంప్లెక్స్ ముషీరాబాద్ లో గాంధి వైద్య కళాశాల, ఆసుపత్రి, లక్డీకాపూల్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆసక్తిదాయకమైన విషయమేమంటే సచివాలయంలో పలు భవనాలను అక్రమంగా నిర్మించినప్పటికీ ఎంసిహెచ్ వాటిని ఈ జాబితాలో చేర్చకపోవడం. డి బ్లాక్ బహుళ అంతస్తుల భవనం కాదు కాబట్టి దీనిని ఈ జాబితాలో చేర్చలేదని అధికారులు వివరించారు. ఈ విషయమై మీడియా సంప్రదించినప్పుడు డి బ్లాక్ మరీ ఎత్తైన భవనాల కేటగరీలోకి రాదు కనుక దీని గురించి ప్రధాన కార్యాలయంలో సమాచారమేదీ అందుబాటులో లేదని జిహెచ్ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ బి. పురుషోత్తమ్ రెడ్డి చెప్పారు. 'ఎత్తైన భవనాల కేటగరీలోకి రాని భవనాలకు సంబంధించిన ఫైళ్ళను సర్కిల్ ఆఫీసులలో పరిశీలించరు' అని ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 9 May, 2009
|