ఈ నేతలు పిసినారులట!
ఆసక్తి కలిగించే ఇతర వ్యయ వివరాలలో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సుదేష్ రాంభొట్ల చేసిన రూ. 10.45 లక్షల ఖర్చు ఆ నియోజకవర్గంలో అత్యధికం. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అభ్యర్థి రూ. 6.16 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ రూ. 5.56 లక్షలు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి బండారు దత్తాత్రేయ రూ. 4.39 లక్షలు వ్యయం చేశారు. లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం అభ్యర్థి జయప్రకాశ్ నారాయణ రూ. 4.58 లక్షలు వ్యయం చేశారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నరసింగరావు చేసిన ఖర్చు రూ. 6.13 లక్షలు.
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంలో దానం నాగేందర్ (కాంగ్రెస్) రూ. 7.28 లక్షలు, కె. విజయరామారావు (టిడిపి) రూ. 5.56 లక్షలు, ఎ. సుభాషణఇ (లోక్ సత్తా) రూ. 3.26 లక్షలు, సనత్ నగర్ అసెంబ్లీ స్థానంలో మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెస్) రూ. 4.83 లక్షలు, టి. పద్మారావు (టిఆర్ఎస్) రూ. 1.91 లక్షలు, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానంలో జయసుధ కపూర్ (కాంగ్రెస్) రూ. 2.13 లక్షలు, తలసాని శ్రీనివాస యాదవ్ (టిడిపి) రూ. 4.83 లక్షలు, ఎం. సారంగపాణి (పిఆర్పీ) రూ. 1.1 లక్షలు, అంబర్ పేట అసెంబ్లీ స్థానంలో జి. కిషన్ రెడ్డి (బిజెపి) రూ. 1.39 లక్షలు, మహమ్మద్ ఫరీదుద్దీన్ (కాంగ్రెస్) రూ. 5.67 లక్షలు ఖర్చు చేశారు.
ఇక ప్రముఖుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి, పులివెందులలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి రూ. 6.7 లక్షలు ఖర్చు చేయగా టిడిపి అధ్యక్షుడు, కుప్పం అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు రూ. 8.33 లక్షలు వ్యయం చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి రూ. 6.94లక్షలు, ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి బి. కరుణాకరరెడ్డి రూ. 2.64 లక్షలు ఖర్చు చేశారు. అయితే, టిఆర్ఎస్ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో అభ్యర్థి కె. చంద్రశేఖరరావు తన ఖర్చుల పద్దును ఇంకా సమర్పించవలసి ఉంది.
Pages: -1- 2 News Posted: 10 May, 2009
|