ఎన్డీఏకు టిడిపి నో
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో తమకు మెజారిటీ లభిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చంద్రబాబు ఆశిస్తున్నారని టిడిపి వర్గాలు తెలియజేశాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ కనుక 100 నుంచి 110 వరకు సీట్లు సాధిస్తే అధికారంలోకి రావడానికి ఇంకా ప్రయత్నాలు చేయగలదనే భావన కూడా చంద్రబాబుకు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రవీణులతో ఒక్కొక్క అసెంబ్లీ సీటు, లోక్ సభ సీటు విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయించారు. తాను గెలుచుకునే సీట్లు ఏవో, గెలుచుకోలేని సీట్లు ఏవో ఆయనకు నిర్దుష్టమైన అవగాహన ఉంది. 'ఏదైనా నియోజకవర్గంలో ఎవరు రెండవ స్థానంలో నిలుస్తారో, ఎవరికి మూడవ స్థానం లభిస్తుందో సూచించే సమాచారం కూడా ఆయన వద్ద ఉంది' పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లలో చాలా వరకు టిఆర్ఎస్ అభ్యర్థుల నుంచేనని టిడిపి సీనియర్లు సూచిస్తున్నారు. 'చాలా చోట్ల టిఆర్ఎస్ ఇంకా మంచి అభ్యర్థులను నిలబెట్టి ఉండవలసింది. కాని అలా చేయలేదు. అందుకే ఆ పార్టీ కాంగ్రెస్ కు చాలా సీట్లను వదులుకుంటుంది' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అయితే మహా కూటమిలో టిఆర్ఎస్ తో చేతులు కలిపినందుకు టిడిపి బాధ పడడం లేదని ఆయన స్పష్టం చేశారు. 'మహా కూటమి ఎన్నికల పోరుకు ఒక ఊపు తీసుకువచ్చింది. టిఆర్ఎస్ లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు' అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి తన నగదు బదలీ పథకం అమలుకు కృషి చేస్తుంది. ఈ పథకానికి ఐదేళ్ళ కాలంలో రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చు. అయితే, అదే సమయంలో తన సరళీకరణ విధానాలకు పార్టీ స్వస్తి చెప్పబోదు. 'మొదటి దశలో టిడిపి ఆర్థిక సరళీకరణకు ద్వారాలు తెరచింది. ఇప్పుడు వాటిని పార్టీ మరింత ముందుకు తీసుకువెళుతుంది. సమాజంలోని పేదలు, నిరుపేద వర్గాలకు వాటి ఫలితాలు అందేట్లు పార్టీ చూస్తుంది' అని టిడిపి నాయకుడు ఒకరు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 12 May, 2009
|