ఎన్డీఏ వైపు చిరు మొగ్గు?
కాగా, బిజెపి సినీ మూలాల ద్వారా చిరంజీవి మనసును చూరగొనడానికి ప్రయత్నిస్తున్నది. చిరంజీవికి శత్రుఘ్న సిన్హా కుటుంబ స్నేహితుడు కనుక ఆయనను మించిన దూత బిజెపికి ఉండకపోవచ్చు. చిరంజీవి, శత్రుఘ్న సిన్హా కుటుంబాలు తరచు పరస్పరం కలుసుకుంటుంటాయి. నిన్నటితరం హీరో శత్రుఘ్న సిన్హా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరంజీవిని తప్పకుండా కలుసుకుంటుంటారు.
నాలుగవ ఫ్రంట్ ఇంకా రూపు దిద్దుకోనందున, తృతీయ ఫ్రంట్ విచ్ఛిన్నమయ్యే సూచనలు గోచరిస్తున్నందున కేంద్రంలో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వవలసి వస్తే కాంగ్రెస్ కన్నా బిజెపినే తమ పార్టీ ఇష్టపడుతుందని పిఆర్పీ నాయకులు ఆంతరంగిక చర్చలలో చెబుతున్నారు. ఇక చిరంజీవికి బిజెపితో భావోద్వేగపరమైన అనుబంధం కొంత ఉంది. ఆ కారణంగానే చిరంజీవి పార్టీని స్థాపించిన వెంటనే బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ఆయనను స్వయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్ డిఎలో చేరవలసిందిగా చిరంజీవికి నచ్చజెప్పేందుకు కెసిఆర్ సేవలను ఉపయోగించుకోవాలని కూడా బిజెపి యోచిస్తున్నది. వాస్తవానికి, కేంద్రంలో ఎన్ డిఎకు మరొక పార్టీ మద్దతును తాను సంపాదించగలనని బిజెపి కేంద్ర నాయకత్వానికి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు కూడా. ఆ పార్టీ ప్రజారాజ్యం కాగల అవకాశాలు ఉన్నాయి.
Pages: -1- 2 News Posted: 14 May, 2009
|