సైన్యం-సారథి-విజేత
ఎన్నికల వ్యూహ రచనకు శ్రీకారంగా రెండు రూపాయల కిలోబియ్యాం పథకానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రైతలు రుణాల మాఫీని సమగ్రంగా అమలు చేశారు. ఆరోగ్యశ్రీని విస్తరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయనన్ని పర్యటనలు చేసి అన్ని జిల్లాల ప్రజలతో మమేకమ్యారు. ఆంధ్రా ప్రజల విశ్వాసాన్ని ప్రోది చేసుకోవడానికి తెలంగాణా అంశంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తూనే, చివరి శాసన సభ సమావేశాలల్లో శాసనసభా కమిటీని ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులను నిరాకరించడం ద్వారా తెలంగణాలోని మొత్తం కాంగ్రెస్ కేడర్ ఎన్నికల్లో పాల్గొనే వెసులు బాటును కల్పించారు. దాంతో దాదాపు 70 మంది తెలంగాణా నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పొందగలిగారు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలానే పనిచేయని సిట్టింగ్ ఎమ్మేల్యేలను పక్కన బెట్టడం ద్వారా మరో అంత మంది కొత్తవారికి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిని బరిలోకి దింపడం ద్వారా లబ్ధని పొందగలిగారు.
ఎన్నికల్లో అతి కీలకమైన ప్రచారాన్ని వైఎస్ ఒంటరిగానే నిర్వహించారు. దానికి సోనియా పర్యటన, రాహుల్ పర్యటన అదనపు హంగులుగా మారాయి. రాష్ట్రంలో ఇతర నాయకులు ఉన్నా వారిని వైఎస్ పరిగణనలోనికి తీసుకోలేదు. అన్ని జిల్లాలను, జిల్లాల్లోని అన్ని ప్రాంతాలను ఆయన చుట్టుముట్టి వచ్చారు. సినీనటుల సభలకు వచ్చిన సంఖ్యలోనే ప్రజలు వైఎస్ సభలకు తరలిరావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రెండో సారి పీఠాన్ని ఎక్కుతున్న వైఎస్ తిరుగులేని నాయకునిగా అవతరించారు. ఢిల్లీ అధిష్టానం దృష్టిలో వైఎస్ ప్రతిష్ట అమాంతం పెరగడం తథ్యం. రాష్ట్రం నుంచి అత్యధికంగా 33 మంది పార్లమెంట్ సభ్యులను పంపించడం చాలా కీలకమైన,అత్యంత కీలకమైన అంశంగా మారింది. కేంద్రంలో యూపియే ప్రభుత్వం తిరిగి గద్దెనెక్కడంలో వైఎస్ సమర్ధమంతమైన పాత్ర పోషించిన నాయకునిగా గుర్తింపు పొందారు. అలానే రాష్ట్రంలో కూడా ఆయనకు అసంతృప్తి బెడద తగ్గినట్టే భావించవచ్చు. తెలంగాణా అంశంలోనూ, గుర్తింపు విషయంలోనూ కేశవరావు, హనుమంతరావు, డిఎస్ లాంటి నాయకులు చేసే హంగామా తగ్గి తీరుతుంది.
Pages: -1- 2 News Posted: 16 May, 2009
|