బీసీల్లో ఉత్సాహం
మెదక్ జిల్లాలో పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ తరఫున నందీశ్వర్ గౌడ్ (బిసి) ఎన్నికయ్యారు. కానీ ఇక్కడ ఒకరికే అవకాశం ఉన్నందున గీతారెడ్డికే మళ్ళీ మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశముంది. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితారెడ్డికి మళ్ళీ అవకాశం వుండటంతో ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన బిసి ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, బిక్షపతి యాదవ్ కొత్తవారు కావడంతో ఈ జిల్లా నుంచి బిసి కోటా భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ వర్గాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. హైదరాబాద్ విషయానికొస్తే ముఖ్యమంత్రి వై.ఎస్.కు అత్యంత సన్నిహితుడు దానం నాగేందర్ కు ఈ సారి మంత్రిమండలిలో స్థానం దక్కే అవకాశముంది. మంత్రి ముఖేష్ గౌడ్ ఈ సారి తన పదవి నిలబెట్టుకోగలుగుతారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు మరోసారి బెర్త్ ఖరారైనట్లు సమాచారం. మరో బెర్తులో కొండా సురేఖకు స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. పొన్నాల, కొండా సురేఖ మున్నూరు కాపులే. ఒకే సామాజిక వర్గం అని పేచీ వచ్చిన నేపథ్యంలో కొండా సురేఖ కాదంటే వరంగల్ తూర్పు నుంచి ఎన్నికైన బి.సారయ్యకు మంత్రి పదవి వచ్చే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనసాగుతున్నారు. అదే జిల్లాకు చెందిన రేవతిపతికి బిసి బెర్తు కింద మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ మళ్ళీ స్థానం పొందుతారు. విశాఖ నుంచి కొత్తగా ఎన్నికైన నర్సీపట్నం ఎమ్మెల్యే బిసి వెలమ కులానికి చెందిన ముత్యాలపాపకు అవకాశంలేకపోలేదని పార్టీ వర్గాల సమాచారం. ఈ జిల్లాల నుంచి బిసి ఎమ్మెల్యేలలో అవకాశం ఇస్తే ఈమెకే చోటు దొరకనున్నది. తూర్పు గోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు ఎమ్మెల్యే కె.నాగేశ్వరరావుకు స్థానం దక్కే పరిస్థితులు వున్నాయి. గుంటూరు జిల్లా నుంచి మంత్రి ఎం.వెంకటరమణ, ఆనం తరఫునుంచి రఘువీరారెడ్డికి మరోసారి అవకాశం దక్కనున్నది.
Pages: -1- 2 News Posted: 19 May, 2009
|