తెరాసలో ప్రక్షాళన
ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమంటూ పలు తెలంగాణ ప్రజా సంఘాలు, చివరకు మావోయిస్టులు సైతం అభిప్రాయపడ్డారు. వీరందరి అభిప్రాయాలకు విలువనివ్వని కెసిఆర్ రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమంటూ ఇంతకాలం ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు కెసిఆర్ ను కూడా పునరాలోచన చేసేవిధంగా స్పష్టమయ్యాయి. కెసిఆర్ కేంద్ర మంత్రి పదవికి, కరీనంగర్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కూడా అప్పటి వరకున్న విభేదాలను పక్కనపెట్టి తెలంగాణ వాదులంతా కెసిఆర్ కు మద్దతు ప్రకటించడంతో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు అనంతరం కూడా కెసిఆర్ ఉద్యమంవైపు దృష్టి సారించకుండా కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించే ధోరణికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇప్పటి పరిస్థితికి కారణమైందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కెసిఆర్ వ్యవహారశైలి వల్లే తెలంగాణ వాదం దెబ్బతిందనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి.
పార్టీని ఉద్యమబాటలో నడిపించాలనే నిర్ణయానికి వచ్చిన కెసిఆర్ రాష్ట్రంలోనే అన్ని స్థాయిల్లో కార్యవర్గాలను రద్దు చేసి తిరిగి వాటిని పునరుద్ధరించి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించాలని, అందులోనే భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రావాలని కూడా తెరాస నిర్ణయించింది. ఏది ఏమైనా గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని తిరిగి అటువంటివి పునరావృతం కాకండా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Pages: -1- 2 News Posted: 21 May, 2009
|