కరుణ పాచిక పారుతుందా?
ఉదాహరణకు, కరుణానిధి మూడవ భార్య రాజాతి కుమార్తె, కవయిత్రి కనిమొళికి రాజకీయాలలో ప్రమేయం లేదని ఆయన అసెంబ్లీలో ప్రకటించిన పది రోజులకే ఆమె ఎంపి అయ్యారు. తమ కుమార్తెకు రాజకీయ పదవిని చూడవలసిందన్న రాజాతి ఒత్తిడికి కరుణానిధి లొంగిపోయినట్లు అప్పట్లో భావించారు. ఇది ఇలా ఉండగా, అళగిరి మూడు ఉప ఎన్నికలలో పార్టీకి విజయాలు సాధించి పెట్టిన తరువాత తన ఆధిపత్యాన్ని ప్రదర్శించసాగారు. లోక్ సభకు పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశం కుటుంబం తరఫున ఢిల్లీలో ఆధిపత్యం ప్రదర్శించడమే. ఇక అళగిరి తమ్ముడు ఎం.కె. స్టాలిన్ స్థానిక పరిపాలన శాఖ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ 4గా తండ్రి నుంచి అధికారం స్వీకరించడానికి సన్నాహాలు చేసుకున్నారు.
ఇక దయానిధి రాజకీయాలకు కొత్త అయినా మొదటిసారి ఎంపి అయినప్పుడే (కమ్యూనికేషన్లు, ఐటి శాఖ) క్యాబినెట్ మంత్రి అయిన తరువాత సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సంవత్సరారంభంలో కరుణానిధి కుటుంబంతో తన కుటుంబం రాజీ పడిన తరువాత తనకు తిరిగి అదే మంత్రిత్వశాఖ లభించగలదని మారన్ ఆశిస్తున్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఎంపి టిక్కెట్ ఇవ్వగలమని, యుపిఎ తిరిగి అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవిని ఇప్పించగలమని 42 సంవత్సరాల మారన్ కు వాగ్దానం చేసినట్లు పార్టీ ఆంతరంగికులు తెలియజేశారు.
234 మంది సభ్యులున్న తమిళనాడు శాసనసభలో డిఎంకె పార్టీ తన మైనారిటీ ప్రభుత్వం మనుగడ కోసం కాంగ్రెస్ వెలుపలి నుంచి ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంది. తన అభ్యర్థులను తమిళనాడు ప్రభుత్వంలో చేర్చుకోనట్లయితే, 35 మంది ఎంఎల్ఎలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వానికి వెలుపలి నుంచి ఇస్తున్న మద్దతుపై పునరాలోచించగలమని బెదరించి సంక్షోభంలోకి నెట్టవచ్చు.
డిఎంకె మహాసభలలో కరుణానిధి తమ భార్యలు, పిల్లలతో ఇటువంటి ఉత్సవాలకు కేడర్ హాజరయ్యే ఏకైక సంస్థ తన పార్టీ మాత్రమేనని తరచు గొప్పలు చెప్పుకుంటుంటారు. 'డిఎంకె ఒక కుటుంబం' అని ఆయన అమితానందంతో ప్రకటిస్తుంటారు.
కాంగ్రెస్ వలె డిఎంకె కూడా ఒక కుటుంబానికి, అదే కరుణానిధి కుటుంబానికి మారుపేరుగా మారిపోయింది.
Pages: -1- 2 News Posted: 22 May, 2009
|