తెలంగాణాపై సైలెన్స్!
టీడీపీలో తెలంగాణ వాదం అటకె క్కింది. మరో ఐదేళ్ల దాకా ఈ అంశంపై ఎవరూ ఏమీ మాట్లాడరాదని చంద్రబా బు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మళ్లీఎన్నికలు వచ్చేదాకా తెలం గాణపై ఎవరేం మాట్లాడించినా ఆచీ తూచీ స్పందించాలని, పార్టీలో గానీ, బయట గానీ జాగ్రత్తగా మాట్లాడాలని హితవు చెప్పినట్లు సమాచారం. తెలం గాణపై ఎంత తక్కువగా మాట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చి నవారవుతారని అన్నట్లు సమాచారం. గతంలో నెంబర్ 2గా చలామణి అయిన కొందరు తెలంగాణపై ఆవేశానికి పోయి పార్టీలు మారినా ప్రజలు వారిని ఆదరించలేదని దేవేందర్ గౌడ్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అసెంబ్లీలో తెలంగాణాపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్ పట్టుబడితే టీడీపీ తీర్మానం చేయాలని కోరుతుందా అన్న ప్రశ్నకు తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు నీళ్లు నమిలారు. మళ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు చూద్దాం. నిన్నటి దాకా తెలంగాణ పాట పాడి ఇప్పుడు లేదంటే జనం ఊరుకుంటారా? ఐదేళ్లు పోతే పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి అని వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణను మీ పార్టీ వ్యతిరేకిస్తుందా అన్న ప్రశ్నకు అదేమీ లేదని, పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలమేనని స్పష్టం చేశాం కదా అంటూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 22 May, 2009
|