బాలీవుడ్ లేని ఐపిఎల్ ఫైనల్
దక్షిణాఫ్రికాలో ఈ సంవత్సరం 'ఐడల్స్' రియాల్టీ షో విజేతలైన జాసన్ హార్ట్ మాన్, సషా - లీ డేవిడ్స్ ఫైనల్ మ్యాచ్ కు ముందు పాపులర్ గీతాలు ఆలపించనున్నారు. జోహాన్నెస్ బర్గ్ లో రెండు వారాల క్రితం జరిగిన 'ఐడల్స్' ఫైనల్ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ప్రముఖులలో శిల్పా శెట్టి కూడా ఒకరు.
ఒక పాత ఫేవరైట్ గయానీస్ సంగీత ప్రముఖుడు ఎడ్డీ గ్రాంట్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతి వివక్ష వ్యతిరేక రెగ్గే గీతం 'గిమ్మీ హోప్, జోవాన్నా' (జోహాన్నెస్ బర్గ్ కు సంక్షిప్త నామం జోవాన్నా) ఆలపించింది ఎడ్డీ గ్రాంట్. ఆయన ఐపిఎల్ ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆయన రెండు సెమీ ఫైనల్స్ సమయంలో కూడా తన గిటార్ తో ప్రదర్శన ఇవ్వవచ్చు.
ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఈసందర్భంగా మాట్లాడుతూ, 'స్టేడియంలలో కిక్కిరిసిపోయే జనం ఎడ్డీకి సాదరపూర్వక స్వాగతం చెబుతారని విశ్వసిస్తున్నాం. ఎడ్డీకి ఈ దేశంలో అసంఖ్యాకంగా అభిమానులు ఉన్నారని ఆయన ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటన వల్ల విదితమైంది. క్రికెట్ అభిమాని కూడా అయిన ఎడ్డీ ఈ గేమ్ ను కూడా ఆనందించగలరని మా నమ్మకం' అని చెప్పారు.
అయితే, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోలకతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినందున ఐపిఎల్ రెండవ సీజన్ ముగింపు రోజు స్టేడియంలో బాలీవుడ్ ప్రతినిధులు కూర్చుంటారా అనేది స్పష్టం కాలేదు.
Pages: -1- 2 News Posted: 22 May, 2009
|