`దేశం'లో దుమారం
కార్యదర్శి పదవి కోసం పోటీ పడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఐదుగురిని పక్కనపెట్టి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు మంత్రి పదవి దక్కని శాసనసభ్యులను టిడిఎల్ పి ఉపనేతలుగా నియమించాలని కొందరు సభ్యులు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చారు. ఒక వ్యక్తికి ఒక పదవి ఉండాలన్న నిబంధనను పార్టీలో అమలు చేయాలనీ, అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలో కాకుండా వికేంద్రీకరణ చేయాలని కూడా పలువురు నూతన శాసనసభ్యులు, సీనియర్లు చంద్రబాబును కోరారు. టిడిఎల్ పి నేతగా చంద్రబాబును ఎన్నుకున్న సమయంలోనే టిడిఎల్ పి ఉపనేతలను, ఇతర పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు యోచించారు. ఈ పదవుల కోసం అనేక పేర్లను కూడా ఆయన పరిశీలించి జాబితాను సిద్ధం కూడా చేసుకున్నారు. అయితే గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్ శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ శాసనసభ్యులు, మరికొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి వెళ్ళి పొలిట్ బ్యూరోలో ఉన్న వారిని ఉపనేతలుగా, ఇతర పదవుల్లో నియమించరాదని కోరారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఈ పదవులను భర్తీ చేద్దామని చంద్రబాబు సీనియర్లతో జరిగిన భేటీ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. పలువురు సీనియర్ శాసనసభ్యులు ఈ పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పదవుల్లో కొత్తవారిని నియమించడం ద్వారా టిడిఎల్ పిలో కొత్త రక్తాన్ని కూడా ఎక్కించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గాలవారీగా ఈ పదవుల్లో కొత్తవారిని ఎంపిక చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Pages: -1- 2 News Posted: 22 May, 2009
|