ఫైనల్స్ లో చార్జర్స్
టాస్ గెలిచిన దక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, హరీస్ తమ కెప్టెన్ నిర్ణయానికి సమర్థింపుగా తొలి ఓవర్లోనే ఓపెనర్లిద్దరినీ ఔట్ చేశాడు. ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. తొలుత ఐదో బంతికి గంభీర్(0), ఆరోబంతికి వార్నర్(0) డకౌటై నిష్ర్కమించారు. 0కే 2 వికెట్లను కోల్పోయిన ఢిల్లీని సెహ్వాగ్ దూకుడు, దిల్షాన్ సొగసైన ఇన్నింగ్స్ ఆదుకుంది. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును ఏడో ఓవర్లో 50 పరుగులు దాటించారు. 10 ఓవర్ల విరామం వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇలా ఆడుతూనే ఓవర్‌కు సగటున 8 పరుగుల రన్‌రేట్‌ను జతచేశారు. అయితే వ్యూహ విరామం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. బ్రేక్ తర్వాత సైమండ్స్ వేసిన ఓవర్లో సెహ్వాగ్39(31బంతులు 5్ఠ4) దూకుడుకు చుక్కెదురైంది. తర్వాత రన్‌రేట్ మందగించింది. దిల్షాన్, డివిలియర్స్‌లు అడపాదడపా బ్యాట్ ఝళిపించినప్పటికీ దక్కన్ ఫీల్డర్లు ఆ షాట్లను సమర్థంగా నిరోధించారు. మొత్తానికి దిల్షాన్ 35 బంతుల్లో(7్ఠ4, 1్ఠ6) అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు ధాటిగా ఆడే డివిలియర్స్(26), కార్తీక్(9) నిష్ర్కమించడంతో చివర్లో ఢిల్లీ పరుగుల వరద తగ్గింది. ఆర్పీసింగ్ చివర్లో చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో ఢిల్లీ ఆటకట్టించాడు. నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 153/8 స్కోరు చేసింది. హరీస్ 3, ఆర్పీసింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
స్కోరుబోర్డు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: గంభీర్ (సి)ఆర్పీసింగ్ (బి)హరీస్ 0, వార్నర్ (సి)గిబ్స్ (బి)హరీస్ 0, సెహ్వాగ్ (ఎల్బీడబ్ల్యూ బి)సైమండ్స్ 39, దిల్షాన్ రనౌట్ 65, డివిలియర్స్ (సి)గిల్‌క్రిస్ట్ (బి)ఆర్పీసింగ్ 26, కార్తీక్ (బి)హరీస్ 9, భాటియా (సి)వేణు (బి)ఆర్పీ సింగ్ 4, మిశ్రా రనౌట్ 0, సంగ్వాన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో) 153/8
వికెట్ల పతనం: 1-0, 2-0, 3-85, 4-133, 5-145, 6-151, 7-153, 8-153
బౌలింగ్: హరీస్ 4-1-27-3, ఆర్పీ సింగ్ 4-0-33-2, ఓజా 3-0-27--0, సైమండ్స్ 3-0-20-1, హర్మిత్‌సింగ్ 3-0-15-0, రోహిత్ శర్మ 3-0-26-0
దక్కన్ ఛార్జర్స్: గిల్‌క్రిస్ట్ (సి)నాన్నెస్ (బి)మిశ్రా 85, గిబ్స్ (బి)నెహ్రా 0, బిలఖియ (స్టంప్డ్)కార్తీక్ (బి)మిశ్రా 10, సుమన్ నాటౌట్ 24, సైమండ్స్ (సి)వార్నర్ (బి)మిశ్రా 24, రోహిత్ శర్మ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (17.4 ఓవర్లలో) 154/4
వికెట్ల పతనం: 1-22, 2-91, 3-102, 4-137
బౌలింగ్: నాన్నెస్ 3-0-38-0, నెహ్రా 4-0-38-1, సంగ్వాన్ 2.4-0-21-0, దిల్షాన్ 3-0-13-0, సెహ్వాగ్ 1-0-25-0, మిశ్రా 4-0-19-3
Pages: -1- 2 News Posted: 22 May, 2009
|