పనికిరాని వీర విధేయత
బాబ్రీ మసీదుపై సంఘ్ పరివార్ తో రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ పి.వి. నరసింహారావును తీవ్రంగా దుయ్యబట్టిన, పక్కా లౌకికవాది అయిన అర్జున్ సింగ్ అయోధ్యలో కరసేవకుల సమూహం 1992 డిసెంబర్ 6న మసీదును కూల్చివేసినప్పుడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తానని బెదరించారు. ఆయన అలా చేసి ఉంటే వెంటనే ఒక హీరో అయి ఉండేవారు. కాని ఆయన ఆ అవకాశాన్న పోగొట్టుకున్నారు. కాని చివరకు ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయన పట్ల సానుభూతి చూపించినవారే తక్కువ. కాంగ్రెస్ చీలిక పార్టీ - కాంగ్రెస్ (తివారి)ని ఆయన స్థాపించారు. కాని ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. ఆ చీలిక పార్టీ ముందుకు సాగలేకపోయింది.
క్రితం సంవత్సరం తన ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంలో అర్జున్ సింగ్ గాంధి - నెహ్రూ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించి, తన తొలి గురువు సంజయ్ గాంధి అని కొనియాడినప్పుడు ఆయన పతనం ప్రారంభమైనట్లయింది. అప్పటి నుంచి మరిన్ని తప్పటడుగులతో ఆయన మరింతగా పతనావస్థకు చేరుకున్నారు.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నూ అర్జున్ సింగ్ తూలనాడడాన్ని గాని, రాహుల్ గాంధిని ప్రధానిని చేయాలనే నినాదానికి శ్రీకారం చుట్టడాన్నిగాని కాంగ్రెస్ ప్రథమ కుటుంబం ఇష్టపడలేదు. తాజా ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న ఆయన కుమార్తె నిర్ణయం పరిస్థితిని మరింత విషమించేట్లు చేసింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన మంత్రివర్గ సహచరుల తొలి బృందం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పార్టీలో అర్జున్ సింగ్ ను గుర్తు చేసుకున్నవారే కరవయ్యారు.
Pages: -1- 2 News Posted: 23 May, 2009
|