ఫైనల్లో చాలెంజర్స్
టాస్ గెలిచిన బెంగళూరు ముందు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది. దీంతో చెనై్న ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పార్థివ్ పటేల్, హేడెన్ శుభారంభమిచ్చారు. హేడెన్ కంటే పార్థివే ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. చూడచక్కని బౌండరీలతో స్కోరుబోర్డుకు ఊతమిచ్చాడు. మరోవైపు హేడెన్ కూడా బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోరు 5.2 ఓవర్లలోనే 50 పరుగుకు చేరింది. 2 బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో ఊపు మీదున్న హేడెన్(26)కు వినయ్ కుమార్ బౌలింగ్‌లో చుక్కెదురైంది. 61 పరుగుల వద్ద తొలివికెట్ కోల్పోయిన చెనై్నకి మరుసటి ఓవర్లో మరో ఎదురుదెబ్బ! 27 బంతుల్లో (7్ఠ4) 36 పరుగులు చేసిన పార్థివ్‌ను కలీస్ ఎల్బీడబ్ల్యూగా పంపాడు. ఇద్దరి నిష్ర్కమణతో రన్‌రేట్ మందగించింది. తర్వాత రైనా, కెప్టెన్ ధోనీల ఆట ప్రారంభమైంది. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును మరో వికెట్ పడకుండా వందకు చేర్చారు. అంతలోనే రైనా(20) వికెట్‌ను ప్రవీణ్ కుమార్ పడేశాడు. తర్వాత 125 పరుగుల వద్ద ధోనీ(28) భారీషాట్‌కు ప్రయత్నించి వాన్‌డర్ మెర్వ్ బౌలింగ్‌లో వినయ్ చేతికి చిక్కాడు. తర్వాత మొర్కెల్, ఓరమ్(9)తో కలిసి స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. మొర్కెల్ ఓ సిక్సర్, ఓ బౌండరీతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెనై్న 20 ఓవర్లలో 146/5 స్కోరు చేసింది.
స్కోరు బోర్డు
చెనై్న సూపర్‌కింగ్స్: పార్థివ్ పటేల్ (ఎల్బీడబ్ల్యూ బి) కలీస్ 36, హేడెన్ (సి)పాండే (బి)వినయ్ కుమార్ 26, ధోనీ (సి) వినయ్ కుమార్ (బి)వాన్‌డర్‌మెర్వ్ 28, రైనా (సి)బౌచర్ (బి)ప్రవీణ్ 20, మొర్కెల్ నాటౌట్ 20, ఓరమ్ (సి)రాబిన్ (బి)వినయ్ 9, బద్రినాథ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో) 146/5
వికెట్ల పతనం: 1-61, 2-69, 3-104, 4-125, 5-140
బౌలింగ్: ప్రవీణ్ 4-0-26-1, కలీస్ 4-0-26-1, వినయ్ కుమార్ 4-0-38-2, కుంబ్లే 4-0-30-0, వాన్‌డర్‌మెర్వ్ 4-0-23-1
బెంగళూరు రాయల్ చాలెంజర్స్: కలీస్ (సి)పార్థివ్ (బి)గోని 9, మనిష్ పాండే (బి)జకాటి 48, వాన్‌డర్‌మెర్వ్ (బి)మొర్కెల్ 2, ద్రవిడ్ (ఎల్బీడబ్ల్యూ బి) మురళీధరన్ 44, కోహ్లి నాటౌట్ 24, టేలర్ నాటౌట్ 17, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (18.5 ఓవర్లలో) 149/4
వికెట్ల పతనం: 1-17, 2-22, 3-94, 4-110
బౌలింగ్: మొర్కెల్ 3-0-26-1, గోని 2-0-23-1, జకాటి 4-0-29-1, రైనా 3-0-23-0, మురళీధరన్ 4-0-15-1, బాలాజీ 2-0-16-0
Pages: -1- 2 News Posted: 23 May, 2009
|