బలపడ్డ బడుగులు
శాసనసభ్యకు మొత్తం 57 మంది ఎన్నిక కాగా, అందులో కాంగ్రెస్ 33, తెలుగుదేశం 17, పిఆర్పీ 1, టిఆర్ఎస్ 3, బిజెపి 1, ఇతరులు 2 ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్, గౌడ-4, పద్మశాలి -1, యాదవ-4, మున్నూరు కాపు-3, తూర్పు కాపు-5, మత్స్యకార-6, వడ్డెర-1, దూదేకుల-1, వెలమ-4, శెట్టిబలిజ-2, గవర-1, కాళింగ-2, ముదిరాజ్-1, రజక-1, తెలుగుదేశం నుంచి గౌడ-3, పద్మశాలి-3, యాదవ-2, మున్నారు కాపు-2, వడ్డెర-1, వెలమ-2, కురుమ-1, కాళింగ-1, ముదిరాజ్-1, పెరిక-1, పీఆర్పీ నుంచి పద్మశాలి-1, టిఆర్ఎస్ నుంచి మున్నారు కాపు-2, ముదిరాజ్-1, బిజెపి నుంచి మున్నారు కాపు -1 గెలిచారు.
కాగా అసెంబ్లీకి రెడ్డి వర్గం నుంచి కాంగ్రెస్ లో 54, టిడిపిలో 19, పిఆర్పీలో 4, టిఆర్ఎస్ లో 2, సిపిఎం 1, బిజెపి నుంచి ఒకటి, ఇతరులు ఒకరు ఎన్నికయ్యారు. కమ్మ వర్గం నుంచి కాంగ్రెస్ లో 4, టిడిపిలో 21, పిఆర్పీలో 1, సిపిఐలో 1, లోక్ సత్తా నుంచి ఒకరు, కాపు వర్గం నుంచి కాంగ్రెస్ లో7, టిడిపిలో 3, పిఆర్పీలో 10 మంది, క్షత్రియుల్లో కాంగ్రెస్ నుంచి 4, టిడిపి నుంచి ముగ్గురు, బ్రాహ్మణ వర్గం నుంచి కాంగ్రెస్ లో ముగ్గురు, వైశ్యుల నుంచి కాంగ్రెస్ 3, టిడిపిలో 2, పిఆర్పీ లో 2 ఎన్నికయ్యారు. వెలమల నుంచి కాంగ్రెస్ లో 3, టిడిపిలో 2, పిఆర్పీలో2 ఎన్నికయ్యారు. వెలమల నుంచి కాంగ్రెస్ 2, టిడిపిలో 5, టిఆర్ఎస్ లో 3, సిపిఐ నుంచి 1 ఎన్నికయ్యారు. టిడిపి నుంచి శ్రీవైష్ణువులు ఒకరు, మొత్తం కాంగ్రెస్ 77 మంది, టిడిపిలో 54 మంది, పిఆర్పీలో 17 మంది, టిఆర్ఎస్ లో 5, సిపిఎం, బిజెపి, లోక్ సత్తా నుంచి ఒక్కొక్కరు, సిపిఐ నుంచి 2 అగ్రకులాల నుంచి ఎన్నికయ్యారు.
దళితులలో... కాంగ్రెస్ నుంచి 16 మంది మాల, 16 మంది మాదిగ, ఒక ఆది ఆంధ్ర... మొత్తం 33 మంది దళితులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టిడిపి నుంచి 6 మాల, టిఆర్ఎస్ నుంచి 1ఎన్నికయ్యారు. టిడిపిలో ఆది ఆంధ్ర వర్గం నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఇక ఎస్టీలలో కాంగ్రెస్ నుంచి 11 మంది, టిడిపి నుంచి 6, సిపిఐ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. మైనారిటీలలో కాంగ్రెస్ 3, టిడిపి 1, మజ్లిస్ నుంచి 7 ఎంపికయ్యారు.
Pages: -1- 2 News Posted: 25 May, 2009
|