అను`గ్రహం' బాగుంది
అదే సమయంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ధైర్యసాహసోపేతమైన వినూత్న నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రపంచాధిపత్య స్థానాన్ని సంపాదించేందుకు ప్రభుత్వానికి మూడో ఇంట్లో వున్న రాహువు సహకరిస్తాడు. బృహస్పతి, శని, సూర్యుడు, బుధ గ్రహాలు యూపీఏ ప్రభుత్వం పటిష్టమైన, స్వతంత్ర నిర్ణయాలను తీసుకునేందుకు బాధ్యత వహిస్తాయి. స్థూలంగా, ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో పాశ్చాత్య దేశాల నష్టాల నుంచి భారత దేశానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. సూర్యుడు పడమట అస్తమించి తూర్పున ఉదయించడం జరుగుతోంది. యూపీఏ స్థిర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి భారతదేశం మరింతగా స్వయం సంపూర్ణంగా తయారుకాగలదు. భారత్ ను ప్రపంచాధిపత్య స్థాయికి తీసుకుపోగల ఈ సుస్థిర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతునివ్వాలి. భయమనే అంశాన్ని మనం వదిలించుకోవాలి. దేశ జాతక చక్రం రీత్రాయ, 2009 సెప్టెంబర్ నుంచి సూర్యుడు ప్రభావం ప్రబలంగా ఉన్న ఆరేళ్ల కాలంలో దేశం అద్భుతమైన పురోగతి సాధించగలదని జోతిష్యులు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి పదవికి మన్మోహన్ సింగ్ పోటీ పడక పోయినప్పటికీ, మంచి నడవడిక, వ్యక్తిత్వం, సునిశిత దృక్పథంల్లాంటి విశిష్ట లక్షణాల కారణంగా అతన్ని ప్రధాన పదవి వరించింది. జ్యోతిష్యాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధ గ్రహాలు ఆరోపణంలో కొనసాగుతున్న జాతకం గల వ్యక్తి రాజస్థానాన్ని పొందుతాడు. మన్మోహన్ గ్రహ స్థితి సరిగ్గా ఇలానే వుంది. దాంతో తాను బుద్ధిపూర్వకంగా ప్రయత్నించకుండానే ప్రధాని కాగల్గారు. కర్మ, ధర్మాల వేళవింపుతో జీవనం సాగించడానికి సజీవ ఉదాహరణగా మన్మోహన్ సింగ్ ను పేర్కొనవచ్చు. ఆయన రాశి చక్రంలో బుధుడు ఉచ్ఛ స్థానంలో ఉండడంతో, తెలివిలోనే కాకుండా, ఆర్థిక విషయాల్లో కూడా లోతైన పరిజ్ఞానాన్ని సంతరించుకునేందుకు దోహదపడింది. సింహాసనం యోగం ఆయన్ని ప్రదానిని చేసింది. రాహు ఆరవ ఇంట్లో ప్రధాన కాలం కొనసాగుతోంది. దాన్ని `శత్రు హంత' స్థితి అని పిలుస్తారు. ఈ పరిస్థితి శత్రు వినాశనానికి దారితీస్తుంది. ఆయన శత్రువులందరూ మట్టిగరుస్తారు.
చంద్రుడు, సూర్యుడు ఆరోహణ స్థానాల్లో కొనసాగుతుండడం వల్ల రాహుల్ ఉద్వేగభరితంగా ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి కలిగిన రాజకీయ నేతలు ్రుదు. అంగారకుడు ఉచ్ఛ స్థానంలో ఉండడం వలన ఆయన చాలా శక్తివంతమైన నేతగా తయారయ్యేందుకు బృహస్పతి సహకరించారు. ధర్మ-కర్మాధిపతి రాజయోగం కారణంగా మానవ కళ్యాణం కొరకు పాటుపడాలన్న కోరిక ఆయనలో బలంగా వుంది.
Pages: -1- 2 News Posted: 25 May, 2009
|