బాద్షాపై తగ్గనున్న భారం
అయితే, అంతర్జాతీయ సూత్రాలతో పోల్చితే బ్రాండ్ విలువ మదింపు ఇండియాలో ఇప్పటికీ సబ్జెక్టివ్ గానే ఉంటున్నదని నిపుణులు అంటున్నారు. 'ఇండియాలో బ్రాండ్ విలువ మదింపు ప్రక్రియ వ్యాపారం విలువ లెక్కింపు ప్రక్రియతో పోలిస్తే ఎక్కువగా సబ్జెక్టివ్ గానే ఉంటున్నది. బ్రాండ్ విలువ మదింపునకు సాధారణంగా అనుసరించే పద్ధతులకు కావలసిన డేటా పరిమితంగా లభ్యం కావడం ఇందుకు ప్రధాన కారణం' అని కెపిఎంజి కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దక్కన్ క్రానికల్ యాజమాన్యంలోని దక్కన్ చార్జర్స్ (డిసి)కి కొనుగోలుదారుల కోసం ఈ సంస్థ 2008 అక్టోబర్ లో అన్వేషించింది. కాని చివరకు 'మిన్నంటుతున్న ఆశలను' తీర్చేందుకు కొనుగోలుదారులు ఎవరూ సిద్ధం కాకపోవడంతో చార్జర్స్ వాటాల అమ్మకం జరగలేదు.
కెకెఆర్ లో వాటాల అమ్మకానికి సంబంధించి తన తరఫున సంప్రదింపులు సాగించడానికి ముంబై ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 'ఏంబిట్'కు బాధ్యత అప్పగించిన షారుఖ్ జట్టు విలువను క్రమంగా తగ్గించడానికి అంగీకరించడం లేదు. 'కెకెఆర్ ఎక్కువ విలువకు అర్హమైనదని ఎస్ఆర్ కె భావన. మాంద్యం పరిస్థితులున్న మార్కెట్ లో లాభసాటి ఒప్పందం కోసం పెట్టుబడిదారులు చూస్తున్నారు. అయితే, మధ్యే మార్గం ఉంటుందని, జూన్ నాటికల్లా ఒక ఒప్పందం కుదరగలదని మా నమ్మకం' అని ఏంబిట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ ప్రతినిధి ఇంకా వివరించడానికి నిరాకరించారు.
ప్రస్తుతం న్యూ సిల్క్ రూట్, ఏక్టిస్, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ వంటి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థలు నైట్ రైడర్స్ లో వాటాల కోసం సంప్రదింపులు సాగిస్తున్నసంస్థలలో ఉన్నాయి. న్యూకాజిల్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ వంటి సంస్థలు కలిగి ఉన్న బ్రిటిష్ బిలియనెయిర్ మైక్ ఏష్లీ కెకెఆర్ వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. (న్యూకాజిల్ క్లబ్ స్థాయిని సోమవారం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ నుంచి రెండవ డివిజన్ కు దింపివేశారు.)
'కెకెఆర్ బ్రాండ్ విలువ మరింత పతనం కాకుండా వాటాలు అమ్మాలని షారుఖ్ ఆసక్తితో ఉన్నారు' అని నైట్ రైడర్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సీజన్ లో చెల్లింపుల రూపంలో దాదాపు రూ. 65, రూ. 75 కోట్ల మధ్య ఖర్చు చేసిన కెకెఆర్ గత సీజన్ లో రూ. 13 కోట్ల మేరకు లాభం ఆర్జించింది. 'అధికంగా ఉన్న మా అనుబంధ సిబ్బంది కారణంగా ఐపిఎల్ జట్లు అన్నింటిలోకి మా చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. అనుబంధ సిబ్బందిలో ఎవరిని అట్టిపెట్టాలో నిర్ణయించేందుకు కెకెఆర్ సహ యజమాని జయ్ మెహతా త్వరలో ఒక నివేదికను రూపొందించనున్నారు. మరింత సంగ్రహంగా ఉండే జట్టు వల్ల మా ఖర్చు తగ్గుతుంది. తద్వారా ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది' అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.
కాగా, క్రికెట్ డైరెక్టర్ జాన్ బుకానన్, ఆయన మిత్రులు, కుటుంబం భవిష్యత్తుపై కెకెఆర్ కోర్ గ్రూప్ జూలైలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కెకెఆర్ అనుబంధ సిబ్బందిలో వారిదే ఎక్కువ సంఖ్య.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|