టైటిల్ మళ్ళీ మాదే: ధోనీ
ఏ జట్టు మీకు ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్నావన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ సమాధానమిస్తూ, ప్రపంచకప్ లో పాల్గొనే ప్రతి జట్టుకూ ఓ ప్రత్యేకత ఉంటుందని, తమతో తలపడే అన్ని జట్లనూ తాము ప్రధాన ప్రత్యర్థులుగానే భావిస్తామన్నాడు. అత్యంత బలీయమైన జట్టు అని దేన్నీ భావించలేమని, మన అదృష్టం బాగుండకపోతే అతి చిన్నదని భావించిన జట్టు కూడా మనపై పైచేయి సాధించవచ్చని మరో ప్రశ్నకు ధోనీ బదులిచ్చాడు. అందుకే ప్రతీ పోటీ తమకు అత్యంత ముఖ్యమైనవనుకుంటున్నానన్నాడు.
పోటీల్లో నెగ్గినప్పుడు భారత క్రికెట్ అభిమానులు తమను ఆకాశానికి ఎత్తేస్తున్నారని, పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ధోనీ గుర్తు చేశాడు. అయితే, పోటీలో ఎలాంటి ఫలితం వచ్చినా సమానంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
బౌలింగ్ పరంగా తమకు పలు మెరుగైన అవకాశాలున్నాయని, పార్ట్ టైమ్ బౌలర్లు కూడా ప్రపంచకప్ లో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని ధోనీ పేర్కొన్నాడు. జహీర్ ఖాన్ పూర్తిగా ఫిట్ లో లేడని, అయినప్పటీకీ తొలి మ్యాచ్ లో అతని చేత ఆడించే అవకాశాల గురించి ఆలోచిస్తున్నామన్నాడు. అలాగే ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తారని భావిస్తున్నానన్నాడు. కాగా, తమకు హర్భజన్ సింగ్ 'ఓ ఎస్సెట్' అన్నాడు. మ్యాచ్ ల ప్రారంభంలో ఆరు ఓవర్లు భజ్జీ చేత బౌల్ చేయించి, చివరి ఓవర్లలో బంతులు వేయించాలన్నది తన వ్యూహంగా ఉందని ధోనీ పేర్కొన్నాడు. భజ్జీ మంచి బౌలర్ గానే కాకుండా చక్కని బ్యాట్స్ మన్ గా కూడా జట్టుకు సేవలందిస్తాడన్నాడు.
Pages: -1- 2 News Posted: 29 May, 2009
|