ధృతరాష్ట్రుని కౌగిలి `దేశం'
ఇక ఎనిమిదేళ్ళ క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి తొలిసారిగా ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణలో 20 శాతం ఓట్లను, 20 శాతం సీట్లను సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసిన టిఆర్ఎస్ నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్తులతో పాటు 87 జడ్పిటీసీల్లో విజయం సాధించింది. ఆ తరువాత 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఐదు పార్లమెంటు, 26 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. ఈసారి టిడిపితో కలిసి పోటీ చేసిన టిఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింది. కేవలం పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లకు పరిమితం అయింది. 20 శాతం ఓట్ల నుంచి టిఆర్ఎస్ బలం ఈసారి టిడిపితో పొత్తు తరువాత కేవలం 5.38 శాతానికి పడిపోయింది.
ఒకవైపు ఓటమి భారంతో ఉండగా, మరోవైపు పార్టీల అసమ్మతి వాదులు ప్రత్యేక ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక టిడిపి వదిలేసిన తరువాత 1999 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకున్న సిపిఎం, ఇప్పుడు టిడిపితో జతకట్టిన తరువాత కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయింది. మిత్రపక్షాలు తమకు గుదిబండలుగా మారాయని టిడిపి విమర్శిస్తుంటే గత పదేళ్ల చరిత్ర మాత్రం టిడిపితో జతకట్టిన పార్టీలు భస్మమవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బిజెపి వల్లనే ఓడిపోయామని గత ఎన్నికల్లో ప్రకటించిన టిడిపి ఈసారి టిఆర్ఎస్ వల్ల ఓడిపోయామని చెబుతోంది. అయితే మిత్రుల వల్ల ఓడిపోయాం కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తాం అని మాత్రం చెప్పలేకపోతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. చివరకు 83లో సైతం సంజయ్ విచార్ మంచ్ తో కలిసి పోటీ చేశారు. ఆ తరువాత బిజెపి, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ వంటి పార్టీలతో కలిసే పోటీ చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన రికార్డు ఇప్పటి వరకు కాంగ్రెస్ కే సొంతం. 1989లో ఒకసారి, మళ్ళీ 2009లో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. కానీ టిడిపికి మాత్రం ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన రికార్డు లేదు.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|