సోనియా, రాహుల్ అన్వేషణ
అయితే, 'ఇలా కచ్చితంగా జరుగుతుందని చెప్పజాలం. కాని ప్రభుత్వంలో పని చేస్తున్నవారు దానిపైనే దృష్టిని కేంద్రీకరించేట్లు, పార్టీలోని వారు సంస్థాగత కార్యక్రమాలపై మనస్సును నిలిపేట్లుగా కృషి జరుగుతుంది' అని పార్టీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి జనార్దన్ ద్వివేది చెప్పారు.
కాగా, సమర్థతతో పని చేయండి లేదా తప్పుకోండి అంటూ సోనియా గురువారం తన మంత్రులను పరోక్షంగా హెచ్చరించారు. మంత్రివర్గ సభ్యుల సంఖ్య దాదాపుగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నందున మార్పులు చేర్పులు ఉండవా అని మీడియా ప్రశ్నించినప్పుడు 'మంత్రివర్గంలో ఉన్నవారు కొందరు ఇతరుల కోసం తప్పుకోవచ్చు' అని సోనియా సమాధానం ఇచ్చారు.
సోనియా సారథ్యంలోని ప్రస్తుత బృందంలో రాహుల్ గాంధికి ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలను చక్కబెడుతున్న ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పని తీరు 'సంతృప్తికరంగానే' ఉన్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు కార్యదర్శులు జితేంద్ర సింగ్, మీనాక్షీ నటరాజన్ ఆయన ప్రధాన బృందంలో సభ్యులు. ఆయనకు రాజీవ్ శుక్లాతో సాంఘిక సంబంధాలు ఉన్నాయి. శుక్లా బాలీవుడ్, క్రికెట్ రంగాలు రెండింటిలోను పాత్ర ఉంది.
కొందరు కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి ఇవ్వవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. వారి స్థానంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నుంచి తన నామినీలను రాహుల్ నియమించవచ్చునని ఆ వర్గాలు సూచించాయి.
కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం దాదాపు తథ్యం. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి కావచ్చు.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|