ప్రతిపక్ష సమన్వయం హుళక్కే
ఇది ఇలా ఉండగా, 64 సంవత్సరాల మీరా కుమార్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధిని ఆమె అధికార నివాసం నంబర్ 10, జనపథ్ లో కలుసుకున్నారు. కాని ఆతరువాత విలేఖరులతో మాట్లాడడానికి ఆమె నిరాకరించారు. ఆమె ఆతరువాతే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ పదవికి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన అనంతరం మీరా కుమార్ మాట్లాడవచ్చుని ఆమె సహాయకులు సూచించారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచారి ఆదివారం సాయంత్రం మీరా కుమార్ తో సమావేశం అయ్యారు.
మీరా కుమార్ అభ్యర్థిత్వానికి సమాజ్ వాది పార్టీ మద్దతు ఇస్తుందా అని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ను మీడియా ప్రశ్నించినప్పుడు సాధారణంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుంటుందని, అన్ని పార్టీలు స్పీకర్ అభ్యర్థికి అనుకూలంగా వోటు వేస్తుంటాయని యాదవ్ చెప్పారు. అయినా అన్ని పార్టీలతో పాటే ఎస్ పి సాగుతుందని ఆయన సూచించారు.
సోమవారం, మంగళవారం లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బుధవారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇది సాఫీగానే సాగిపోవచ్చు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి, ముఖ్యంగా బిజెపికి ఇవ్వవచ్చు. అయితే, ఈ విషయమైన ఇంకా లాంఛనంగా చర్చలు ప్రారంభం కాలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ విషయం తేలవచ్చు.
కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి ఉప సభాపతి పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వజూపుతూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగి ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీతో స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తున్నది.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|