ఇంజనీర్లకు లాబ్ శిక్షణ
పిజి ఇంజనీర్ల సామర్థ్యం పట్ల కూడా సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. 'వారిది తాజా పాండిత్యం కాదు. అందువల్ల వారు రీసర్చ్ కెరీర్ కు తగినవారు కారు' అని పిలానిలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పిజి డిప్లొమా ప్రోగ్రామ్ ను ప్రారంభించే ఎనిమిది సిఎస్ఐఆర్ లేబరేటరీలలో ఇది ఒకటి.
బిటెక్, బిఇ గ్రాడ్యుయేట్లు అర్హులైన ఈ ప్రోగ్రామ్ కు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ. 48 వేలు. అయితే, ప్రతి విద్యార్థికి నెలకు రూ. 24 వేల మేరకు స్టైపెండ్ అందుతుంది. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ నుంచి మెటీరియల్స్ సైన్సెస్, పెట్రోకెమికల్స్ వరకు వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో ఈ కోర్సులు ఉంటాయి. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ లోగా చేరవచ్చు.
సిఎస్ఐఆర్ కు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదు కనుక ఇది డిప్లొమాను అందజేస్తుంది. 'కృతార్థులైన విద్యార్థులు కొందరిని నేరుగా సిఎస్ఐఆర్ లో చేర్చుకుంటారు. మిగిలినవారు పరిశ్రమకు లేదా ఇతర సంస్థలకు ఉపయోగపడగలరు' అని బ్రహ్మచారి సూచించారు.
మార్కెట్ సిఎస్ఐఆర్ డిప్లొమాను ఆమోదించగలవని లేబరేటరీల డైరెక్టర్లు భావిస్తున్నారు. 'ప్రతిష్ఠాకరమైన కొన్ని మేనేజ్ మెంట్ విద్యా సంస్థలు కూడా డిప్లొమాలను ప్రదానం చేస్తుంటాయి' అని శేఖర్ తెలిపారు. 'ఈ విద్యార్థులకు చాలా విశ్వవిద్యాలయాలలో లేదా ఇంజనీరింగ్ కాలేజీలలో లభించని ఆధునిక పరిశోధన, పరికరాలు, సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి' అని ఆయన తెలిపారు.
అయితే, కొందరు విద్యావేత్తలు ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కడా విశ్వవిద్యాలయాలు లేకుండా సైన్స్ పురోగమించలేదు' అని ఐఐటి ఖరగ్ పూర్ మాజీ డైరెక్టర్ కస్తూరి లాల్ చోప్రా అన్నారు. 'ఇటువంటి లేబరేటరీలలో చాలా వరకు కార్యకలాపాలు కేంద్రీకృత దృష్టితో జరుగుతుంటాయి. ఇతర ఇన్ స్టిట్యూషన్లకు ఆమోదయోగ్యమైన స్థూలమైన విద్య ఈ ఇంజనీర్లకు లభిస్తుందా' అని చోప్రా అన్నారు. ప్రభుత్వ పరిశోధనా శాలల్లో విద్యా బోధనను ప్రవేశపెట్టడం దేశంలోని విశ్వవిద్యాలయాలకు నష్టదాయకం కాగలదని చోప్రా అన్నారు.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|