విశిష్టమైనది ఈ లోక్ సభ
న్యూఢిల్లీ : మహమ్మద్ అజహరుద్దీన్ కు ఊపడానికి చేతిలో బ్యాట్ ఉండదు. కబీర్ సుమన్ 'చెత్త ప్రశ్నలు అడగకండి' అంటూ విరుచుకుపడకుండా నిగ్రహం పాటించవలసి ఉంటుందేమో. అయినా కూడా కొత్త లోక్ సభ యువజనులు, వృద్ధులు, మేధావులు, అందమైనవాళ్ళ సమాహారంగా పూర్వపు లోక్ సభ కన్నా మరింత రమణీయంగా భాసించవచ్చు. ఏమైనా చర్చల స్థాయి పెరుగుతుందని ఆశించవచ్చు.
ప్రతిపక్ష బెంచీలలో ఆకట్టుకునే వక్తల కొరతతో 14వ లోక్ సభ వెలవెలబోయింది. ఆ లోక్ సభలో ఎల్.కె. అద్వానీ చర్చలను ప్రారంభించిన తరువాత అనంతకుమార్ లు, షానవాజ్ హుస్సేన్ లు, ఖరబెల స్వెయిన్ ల నిరాసక్తిదాయక ప్రసంగాలతో కార్యక్రమాలు చప్పగా సాగుతుండేవి.
ఈ దఫా వారి శ్రేణి బలమైనదే. రాజ్యసభ నుంచి లోక్ సభకు వచ్చినవారు చాలా మంది ఉండడం ఇందుకు కారణం. సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి రాజకీయ స్పిన్ బౌలింగ్ చేయనుండగా యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్ ఆర్థికపరమైన, విదేశాంగ విధానపరమైన బౌన్సర్లు సంధించేందుకు వెనుకాడరు.
వారికి అధికార పక్షంలో బలమైన ప్రత్యర్థులే ఉన్నారు. దేశంలో అత్యుత్తమ వక్తలలో ఇద్దరు సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్ కూడా అధికార పక్షంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం, కపిల్ సిబల్ వంటి రాటుదేలిన వక్తలు, జ్యోతిరాదిత్య సింధియా వంటి యువతరం వక్తలకు వారు తోడు కానున్నారు.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|