లెక్కల్లో బాలికలూ ఘనులే
ఐఎంఒ జట్లలో బాలికల దామాషాలో దేశాలలోనే కాలం మార్పులు, జన్యు సంబంధిత జనాభా మధ్య తేడాలు లెక్కల్లో విశేష ప్రతిభకు 'బయొలాజీకల్ అంశాలు ప్రధాన కారణం కాజాలవు' అని సూచిస్తున్నట్లు సైంటిస్టులు తమ నివేదికలో పేర్కొన్నారు.
30 అగ్రశ్రేణి ఐఎంఒ జట్లపై జరిపిన విశ్లేషణలో ఇండియా, ఇరాన్, టర్కీ దేశాలలో బాగా తక్కువ మంది బాలికలు, బాలబాలికల మధ్య సమానత్వానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) కేటాయించిన స్కోర్లు తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. 'ఈ దేశాలలో గణిత శాస్త్రం విషయంలో బాలబాలికల మధ్య తేడాలకు సాంఘిక, సాంస్కృతిక అంశాలేనన్న అభిప్రాయానికి అనుగుణంగానే ఈ విశ్లేషణ ఉంది' అని హైడ్ పేర్కొన్నారు.
బాలబాలికల మధ్య అసమానత్వం ఉండడం వల్ల చాలా విధాలుగా టీచర్లు బాలికల కన్నా బాలురనే ఎక్కువగా ప్రోత్సహించవచ్చునని, లెక్కలతో సంబంధం లేని కోర్సులు తీసుకోవలసిందిగా బాలికలకు సలహా ఇవ్వవచ్చునని, లేదా గణితశాస్త్రంలో ప్రతిభ ఉన్న బాలికలను ప్రోత్సహించకపోవచ్చునని సైంటిస్టులు అంటున్నారు.
'లెక్కల విషయంలో మహిళల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ పురుషుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోదనడంలో నాకు సందేహం లేదు' అని ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టిఎఫ్ఐఆర్)కు చెందిన అవార్డు విజేత అయిన గణిత శాస్త్రజ్ఞరాలు సుజాతా రామదొరై చెప్పారు. ఆమె ఈ అధ్యయనంలో పాల్గొనలేదు. 'లింగపరమైన ఈ అంతరం తగ్గిపోతే మహిళలకు కూడా అవకాశాలు రాగలవు' అని రామదొరై సూచించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థీరిటికల్ ఫిజిక్స్ నుంచి ఆమె 2006లో శ్రీనివాస రామానుజం బహుమతి పొందారు.
Pages: -1- 2 News Posted: 2 June, 2009
|