వీరూతో వైరం లేదు: ధోనీ
ఇంగ్లాండ్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్‌ను తామే గెలుచుకుంటామని ధోనీ అన్నాడు. ప్రస్తుతం ఆటగాళ్లంత అద్భుత ఫామ్‌లో ఉన్నారని, ఈ నేపథ్యంలో తమను అడ్డుకోవడం ఇతర జట్లకు కష్టమేనన్నాడు. కిందటి వరల్డ్‌కప్‌తో పోల్చితే తాము ప్రస్తుతం టి-20లో ఎంతో రాటుదేలామని, ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితానిన తారుమారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ ఎంతో పటిష్టంగా ఉందని, ఇదే తమకు కలిసివస్తోందన్నాడు. ఇక, అభిమానుల ప్రోత్సాహం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని, వారి మద్దతుతో తాము మరింత మెరుగ్గా ఆడతామని ధోనీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
బాధించింది.
టీమిండియాలో ఆటగాళ్ల మధ్య సంబంధాలు చెడిపోయాయని, మీడియాలో వచ్చిన కథనాలు ఎంతో బాధించాయని జట్టు కోచ్ గారి కిరిస్టెన్ వాపోయాడు. సారథి ధోనీతో సహా జట్టులో అందరు కలిసికట్టుగా ఉన్నారని, ఏ ఒక్కరూ కూడా అసంతృప్తిలో లేడన్నాడు. కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ సెహ్వాగ్‌ల మధ్య ఏదో జరిగిందని, అందువల్లే అతన్ని జట్టుకు దూరంగా వచ్చాయని మీడియాలో వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. దీనిపై కోచ్ కిర్స్‌టెన్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. జట్టంతా ఒకే తాటిపై ఉందని, ఏ ఒక్కరి మధ్య మనస్పర్థాలు లేవన్నాడు. దీనిపై వచ్చిన కథనాల్లో పసలేదన్నాడు. ప్రపంచకప్‌కు ముందు వచ్చిన ఇటువంటి వార్తలు జట్టును బాధిస్తున్నాయని, అయితే దీన్ని ఇంతటితో వదిలేసి ఆటపైనే మనస్సు నిలపాలని జట్టు సభ్యులకు సూచించాడు.
Pages: -1- 2 News Posted: 5 June, 2009
|