టెక్కలి నుంచి ఎర్రం పోటీ?
హైదరాబాద్: టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవతీపతి మృతితో ఏర్పడ్డ ఖాళీని ఏకగ్రీవ ఎన్నిక ద్వారా భర్తీ చేద్దామన్న కాంగ్రెస్ ప్రయ త్నాలు ఫలించే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రేవతీపతి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీకి దింపితే, మానవతాదృక్పథంతో తమ పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టదని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి హామీ ఇచ్చారు. సీపీఐ కూడా తమ అభ్యర్ధిని పోటీలో నిలబెట్టబోమని ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం మాత్రం గతానుభవాలు దృష్టిలో ఉంచుకుని పోటీలో ఉండాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా లోక్‌సత్తా కూడా పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నక్సల్స్ ఘాతుకానికి బలయిన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాల్లో ఏ పార్టీ కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేయాలన్న ప్రతిపాదన చేసింది. ఆ ప్రకారంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ నక్సల్స్ చేతిలో మృతి చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన ఆయన భార్యపై టీడీపీ పార్టీ పోటీ పెట్టలేదు.
మక్తల్ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్శిరెడ్డిని నక్సల్స్ హత్య చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ పోటీ పెట్టలేదు. అన్ని సందర్భాల్లోనూ టీడీపీ పోటీ పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించిన విషయాన్ని ఆ నేతలు గుర్తు చేస్తున్నారు. తెర్లాంలో టీడీపీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాష్, ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిజెఆర్ మృతి చెందిన సమయాల్లో రెండు పార్టీలూ పోటీలు పెట్టకపోవడంతో ఏకగ్రీవమయిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు చోట్లా లోక్‌సత్తా పోటీ చేసింది.
Pages: 1 -2- News Posted: 5 June, 2009
|