టెక్కలి నుంచి ఎర్రం పోటీ?
అయితే, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని నిలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, కట్టుతప్పిన కాంగ్రెస్‌పై పోటీ చేయవలసిందేనన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది. అంతకంటే ముందు నక్సల్స్ చేతిలో ఎలిమినేటి మాధవరెడ్డి హత్యకు గురయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి ఉమామాధవరెడ్డిపై కాంగ్రెస్ పోటీ చేసింది ఆ తర్వాత బొబ్బిలి టీడీపీ ఎంపి పైడితల్లినాయుడు మృతి చెందిన సందర్భంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్ధిని నిలబెట్టింది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల టీడీపీ ఎంపిపిని నక్సల్స్ హత్య చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబసభ్యుడిపై కాంగ్రెస్ పోటీ చేసింది. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని, టెక్కలిలో జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మృతి చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తాము సానుకూలంగా వ్యవహరించినప్పటికీ, తమ పార్టీ నేతల విషయంలో మాత్రం కాంగ్రెస్ పోటీలకు దిగినందున, టెక్కలిలో కూడా తాము సంప్రదాయాన్ని పాటించవలసిన అవసరం లేదని టీడీపీ నేతలు నిర్మొహమాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
టెక్కలి ఉప ఎన్నికలో టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడును బరిలోకి దింపాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గుండెకాయ వంటి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలహీనమయిన దృష్ట్యా, తిరిగి అక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే ఎర్రన్నాయుడు వంటి ప్రముఖుడినే బరిలోకి దించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు. కొందరు మాత్రం ఆయనను రాజ్యసభకు పంపితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నప్పటికీ, ముందు జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలంటే ఎర్రన్నాయుడు సేవలను జిల్లా స్థాయిలో వినియోగించుకోవాలంటున్నారు. అదీగాక, ఉప ఎన్నికలో అధికారపార్టీ అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఎర్రన్నాయుడు వంటి నేతను బరిలోకి దింపితేనే వాటిని ఎదుర్కోగలమంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేవతీపతిపై ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు పోటీ చేసిన విషయం తెలిసిందే.
Pages: -1- 2 News Posted: 5 June, 2009
|