పిఎం బడ్జెట్ ఆదేశాలు!
మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పిసి ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఆర్థికవేత్త అభిజిత్ సేన్, మాజీ క్యాబినెట్ కార్యదర్శి బి.కె. చతుర్వేది, మానవ హక్కుల కార్యకర్త హమీదా సయీద్ కూడా ఈ సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. సంఘంలో కొత్త సభ్యులుగా ఆర్థికవేత్తలు సౌమిత్రా చౌదరి, మిహిర్ షా, దళిత విద్యావేత్త నరేంద్ర జాదవ్ నియుక్తులయ్యారు. నరేంద్ర జాదవ్ ప్రస్తుతం పుణె విశ్వవిద్యాలయం గౌరవ వైస్ చాన్స్ లర్ గా ఉన్నారు.
వ్యవసాయ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ను కొనసాగించడం ద్వారా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వామపక్ష భావజాలం గల సభ్యులు వామపక్షాల ఒత్తిడి వల్లే తమ పదవులు పొందారనే అభిప్రాయాన్ని తొలగిస్తున్నది. ఇక కొత్త సభ్యులలో కనీసం ఇద్దరు మిహిర్ షా, నరేంద్ర జాదవ్ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా గిరిజనులు, దళితులతో కలసి పని చేసిన నేపథ్యం ఉంది.
మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ సంబంధాలు వ్యక్తిగతమైనవనే భావన కూడా ఉన్నది. వారిద్దరి మధ్య ఒకరిపై మరొకరి ఆధిపత్యం వహించిన చరిత్ర ఉందని చాలా మంది భావిస్తుంటారు. ఇందిరా గాంధి మంత్రివర్గంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలోనే మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) గవర్నర్ గా నియుక్తుడయ్యారు. ఈనాడు మన్మోహన్ సింగ్ బాస్, ప్రణబ్ ఆయన కింద ఆర్థిక మంత్రి.
కుట్రలను కనుగొని చర్చించాలని నిరంతరం తహతహలాడే కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు శుక్రవారం జారీ అయిన ఈ ఆదేశాన్ని వ్యక్తిగత అంశాన్ని జోడించవచ్చు. 'ప్రణబ్ ముఖర్జీ తలపండిన నాయకుడు. పాతిక సంవత్సరాలకు ముందే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కాని మన్మోహన్ సింగ్ ఇప్పుడు కొత్త, సాధికారత గల మన్మోహన్ సింగ్. ఈ బడ్జెట్ తనదేనని, ప్రణబ్ ముఖర్జీది కాదనే సందేశాన్ని పంపాలని ఆయన కోరుకుంటుండవచ్చు' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు.
అయితే, ఢక్కామొక్కీలు తిన్న ప్రభుత్వ, పార్టీ వర్గాలు మాత్రం ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి మన్మోహన్ సింగ్ ఆదేశానికి అతిగా ప్రాముఖ్యం ఇవ్వరాదని అంటున్నారు. 'ప్రధాని తన పదవి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుండవచ్చు, తన ప్రాథమ్యాలేమిటో స్పష్టం చేస్తుండవచ్చు. అంత మాత్రాన ప్రణబ్ ముఖర్జీని తక్కువ చేసి చూడాలని ఆయన అనుకుంటున్నారని భావించరాదు' అని వారిద్దరితో కలసి పని చేసిన కాంగ్రెస్ సీనియర్ ఎంపి ఒకరు పేర్కొన్నారు. 'ఆదిలో ఉభయ పక్షాల పరంగా సర్దుబాట్లు ఉండి ఉండవచ్చు. కాని దీర్ఘ కాలంలో ప్రాధాన్య క్రమంలో గందరగోళం ఏమీ ఉండదు. ప్రభుత్వ బాస్ ఎవరనే విషయమై అపోహలేవైనా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలు వాటిని తొలగించాయి' అని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 6 June, 2009
|