కూటమిపై తెరాస కుతకుత
హైదరాబాద్: మహాకూటమి పక్షాలకు దూరంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది. తెరాసతో పొత్తు కారణంగానే తెలంగాణాలో అనేక సీట్లు కోల్పోయామంటూ అటు తెలుగుదేశం ఇటు వామపక్షాలు కూడా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన టిఆర్‌ఎస్ నాయకత్వం తాజాగా సిపిఐ రాష్టక్రార్యదర్శి కె.నారాయణ చేసిన ఘాటైన వ్యాఖ్యతో మరింత భగ్గుమంటున్నది. తాము మహాకూటమిలోనే ఉంటామని, అయితే టీఆర్‌ఎస్‌తో మాత్రం ఇక ఎట్టి పరిస్థితిలోనూ కలసి సాగబోమని నారాయణ చేసిన వ్యాఖ్య అనంతరం ఇక కూటమితో తమకు ఏమాత్రం పొసగదన్న నిర్ణయానికి టిఆర్‌ఎస్ వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్‌కు మద్దతు పలకరాదన్న నిర్ణయానికి కట్టుబడి మాత్రమే స్పీకర్ ఎన్నికకు ముందు రోజు టిఆర్‌ఎస్‌తో చర్చలకు వెళ్ళాము తప్ప కూటమితో తమకు దాదాపు సంబంధం లేనట్టే అని టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. బలం లేనప్పుడు పోటీ వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా టిడిపి ఒంటెత్తు పోకడలకు తెర తీసిందని, అందుకే టిడిపి తన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము తటస్థంగా ఉంటా మని స్పష్టం చేయాల్సి వచ్చిందని టిఆర్‌ఎస్ అంటున్నది. పోటీ పెట్టరాదని టిడిపి నిర్ణయిం చుకున్న తర్వాతే ఆ పార్టీ,వామపక్షాలు ఏర్పాటు చేసిన పాత్రిేయుల సమావేశానికి తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వెళ్ళారని, అంతమాత్రాన తాము ఇంకా మహాకూటమితో కలసి ఉన్నట్టు కాదని టిఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టంగా తేల్చి చెబుతున్నది.
Pages: 1 -2- News Posted: 7 June, 2009
|