కూటమిపై తెరాస కుతకుత
సభా సమన్వయం విషయంలో టిడిపి లేదా మహాకూటమితో కలసి ఉంటే తమకు ఒరిగే లాభమేమిటన్న వాదనను టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం ముందుకు తీసుకువచ్చింది. ప్రత్యేక తెలంగాణపై తీర్మానం చేయాలని తాము చేయ బోయే ఒత్తిడికి టిడిపి, సిపిఐ నుంచి మద్దతు లభిస్తుందో లేదో స్పష్టం కాలేదని, అలాగే 610 జీవో, తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు తదితర అంశా లపై వచ్చే బడ్జెట్ సమావేశాలలో తాము చేయ బోయే ఆందో ళనకు సైతం మద్దతు ఉంటుందో లేదో చెప్పలేని స్థితిలో ఇక కూటమితో ఉంటే తమకు ఒనగూరే లాభమేమిటని సీనియర్ నేత ఒకరు ప్రశ్నిం చారు. స్పీకర్ పదవికి పోటీ పెట్టటం లేదంటూ టిడిపి,వామపక్షాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వెళ్ళటం ద్వారా టిఆర్‌ఎస్ ఇంకా టిడిపి ఛత్రఛాయలోనే ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుం డటంతో ఆ పరిస్థితిని మార్చు కోవాలని టిఆర్ ఎస్ శాసనసభా పక్షం సభ్యులు కొందరు ఇటీ వల సమావేశమై నిర్ణయించినట్టు సమాచారం.
ఇకముందు శాసనసభ సమావేశాల్లో ప్రజారాజ్యం పార్టీతో సభా సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలని గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని టిఆర్‌ఎస్ నిర్ణయించినట్టు సీనియర్ నేతలు చెబుతు న్నారు. ఆ పార్టీతో కలిస్తే 28 మందితో కూడిన మూడవ కూటమి సభలోఉన్నట్టు అవుతుందని, సంఖ్యాబలం ఆధారంగా టిడిపి తర్వాత మరి కాస్త ఎక్కువ సమయం కేటాయించే వీలు, పైగా తెలంగాణ ప్రాంతసమస్యలపై చర్చకు పిఆర్పీ సైతం సుముఖంగానే ఉంది కాబట్టి ఒకరికి ఇద్దరు సభ్యులు గట్టిగా నిలదీసే అవకాశం ఉంటుందని తాము అనుకుంటున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 7 June, 2009
|