'ఇది తీయని వెన్నెల రేయి'
రవి మళ్లీ యామినితో కలిసి తోటరాముడు సినిమా నుండి 'ఓ బంగరు రంగుల చిలుకా పలుకవే' పాట పాడారు. ఈ పాట పూర్తి కాగానే ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ముందుగా వాద్య సంగీతం అందించిన అందరినీ పరిచయం చేసి తమిళులైనా నెలరోజుల్లో వారు ఇన్ని తెలుగుపాటలకు మంచి సంగీతం అందిస్తున్నందుకు వారిని అభినందించారు. ఆ తరువాత చిమట శ్రీనివాసరావు సంగీత అభిమానులకు తన మ్యూజిక్ వెబ్ సైట్ ద్వారా చేస్తున్న సేవను కొనియాడుతూ, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు నిర్విరామంగా కృషిచేశారని కొనియాడారు.
అనంతరం రవి స్వప్న సినిమా నుండి 'ఇదే నా మొదటి ప్రేమలేఖ' అనే ప్రేమగీతాన్ని ఆలపించారు. స్వప్న సినిమాకు రాజ్ కపూర్ సంగం మాతృక. ఆ సినిమాలో శంకర్ - జైకిషన్ ల సంగీత దర్శకత్వంలో రఫీ పాడిన यह मेरा प्रेमपत्र पढकर పాట, చాలా అద్భుతమైన పాట, చాలా మందికి గుర్తుండే ఉంటుంది. శంకర్ - జైకిషన్ లతో సత్యంకు చాలా స్నేహానుబంధం ఉందని బాలు తరచూ చెబుతూ ఉంటారు. ఆ హిందీ పాటకు ఆ సంగీత దర్శకులకు ఏమాత్రమూ తీసిపోకుండా ఈ తెలుగుపాటకు సత్యం బాణీ సమకూర్చారు.
విరామ సమయంలో విజయ మళ్ళీ వేదిక పైకొచ్చి చిమట శ్రీనివాసరావును ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీని తనకు పాత పాటలపై గల మమకారాన్ని అందరితో పంచుకున్నారు. అంచనాలను మించి మొత్తం వెయ్యి మంది వరకు ప్రేక్షకులు వచ్చారని, ఇది నిజంగా పాతపాటలకు పట్టాభిషేకమేనని ఆయన సగర్వంగా విన్నవించుకున్నారు. విరామానికి ముందుగా బాలు వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో ChimataMusic.com లో ఉంది. ఇది తప్పకుండా వినవలసిందే / చూడవలసిందే. సత్యంతో పనిచేయడం నిజంగా తన అదృష్టమని ప్రస్తావించారు. విరామానంతరం వాసురావు వీడియోను ప్రదర్శించారు. సత్యంకు పిల్లలు లేరని కాని అయన బాలును పెద్దకొడుకుగా తనను చిన్నకొడుకుగా భావించేవారని అన్నారు. మన శాస్త్రాలలో చెప్పిన గురుశిష్య పరంపర అంటే బహుశా ఇదేనేమో.
రెండవ భాగం ప్రారంభం కావడానికి ముందు సభలోనే ఉన్న నటుడు, కవి అక్కిరాజు రామకృష్ణారావును వేదికపైకి విజయ ఆహ్వానించారు. ఒక తేటగీతి పద్యంలో సత్యంను అక్కిరాజు ప్రసంశించారు :
అరయ స్వర్గంగతూగు సత్యంబుగాదొ
అర్థి అలసొంపు నడక సత్యంబుగాదొ
అరయ జీమూత గర్జ సత్యంబుగాదొ
అర్థి భ్రమరంబు రుతియు సత్యంబుగాదొ
Pages: -1- -2- -3- 4 -5- News Posted: 9 June, 2009
|