ఎండిపోయిన రిజర్వాయర్లు
నీటి చౌర్యాన్ని అరికట్టే ప్రణాళిక లేనందున ఈ సంవత్సరం కూడా పరిస్థితి పునరావృతం కానుంది. సాగునీరు అందక పోవడంతో గత ఐదేళ్ళుగా ఎమ్మిగనూరు, కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టు బీడుభూమిగా మారింది. రాష్ట్ర సరిహద్దులో రావాల్సిన నీటివాటా రాకపోవడంతో చివరి ఆయుకట్టు సాగునీరు అందడం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన, గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టుల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతోంది. ఇదిలా ఉండగా, ఎల్ఎల్ సి పరిధిలోని 123.30 కిలోమీటర్ల దూరం ప్రవహించే కాలువకు ఇప్పటి వరకు 101.86 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు పూర్తిచేశారు. దీంతో మిగిలిన ప్రాంతాలలో కాలువకు గండ్లుపడడంతో రైతులకు సాగునీరు సక్రమంగా అందడంలేదు. మిగిలిన కాలువ లైనింగ్ పనులుపూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అధికార యంత్రాంగానికి సైతం తలనొప్పిగా మారింది.
ఏడు ప్యాకేజీలలో 179 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, మొదట కేవలం మూడు ప్యాకేజీలకు మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. మరో నాలుగు ప్యాకేజీలకు కాంట్రాక్టర్లు ముందురు రాకపోవడంతో వాటిని 11 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అందులో 4బి ప్యాకేజీకి మాత్రం టెండర్ రావడంతో మళ్ళీ మిగిలిన 10 ప్యాకేజీలను 14 ప్యాకేజీలుగా విభజించారు. అయినా 3ఇ, 6ఏ, 6బి ప్యాకేజీలకు మాత్రం స్పందన లభించగా, 11 ప్యాకేజీ పనులు అలాగే నిలిచిపోయాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కర్నూలు, కడప జిల్లాల్లో 305.65 కిలోమీటర్ల దూరం ప్రవహించే కెసి కాలువ కింద మొత్తం 2,64,800 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అందులో కర్నూలు జిల్లాలో 1,84,250 ఎకరాలకు, కడప జిల్లాలో 80,550 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. గత ఏడాది కెసి కింద ఖరీఫ్ లో 2,34,000 ఎకరాలకు, రబీలో 2,25,00 ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ఏడాది ఎప్పటి నుండి కెసికి సాగునీటిని విడుదలచేస్తారనే విషయం ఇంతవరకు స్పష్టం చేయలేదు. దీంతో కెసి ఆయకట్టు రైతులు మరోవైపు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 9 June, 2009
|