విద్యకు భారీగా నిధులు
ఉన్నత విద్యా రంగంలో 'సానుకూల' ఫలితాలను శీఘ్రంగా చూపించాలనే ప్రభుత్వ తాపత్రయం కారణంగానే ఐఐఎంలు, ఎన్ఐటిలు, మోడల్ కాలేజీలకు ఆర్థిక అనుమతిని పొందడానికి హడావుడి పడుతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. 'తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగంలో పటిష్ఠమైన పురోగతి సాధించినట్లు దేశ ప్రజలకు చెప్పాలనే ఆకాంక్షే ఈ సంస్థలన్నిటికీ ఒకేసారి అనుమతి కోరుతున్నట్లు స్పష్టమవుతున్నది' అని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు.
అయితే, ఇఎఫ్ సి అనుమతి లభించినంత మాత్రాన ఈ సంస్థలననీ ఈ సంవత్సరమే పని చేయనారంభిస్తాయని అర్థం కాదని ఆ వర్గాలు హెచ్చరించాయి. అయితే, ఐఐఎంలు, ఎన్ఐటిలను ప్రారంభించే అవకాశాలు దీని వల్ల పెరగవచ్చు. 'అయితే, కొత్త సంస్థల ఏర్పాటులో తాము పురోగతి సాధించినట్లు చెప్పుకునే స్థితిలో ప్రభుత్వం ఉంటుంది' అని మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
అయితే, ఈ సంవత్సరం ఆరంభంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో దొర్లిన పొరపాటు వల్ల ఐఐఎంకు నోచుకున్న రాజస్థాన్ ఆ సంస్థ కోసం వేచి ఉండవలసి వస్తుందని ఇఎఫ్ సి సమావేశం కోసం రూపొందించిన ముసాయిదా పత్రం ద్వారా తెలుస్తున్నది. బుధవారం ఆర్థిక అనుమతి కోసం కమిటీ పరిశీలనకు వచ్చే ఆరు ఐఐఎంలను ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్ఠాకరమైన ఈ బి స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం తొలుత వాగ్దానం చేసిన రాష్ట్రాలు అవి. రాజస్థాన్ ఐఐఎంకు బ్లూప్రింట్ కు రూపకల్పన ఆతరువాత జరుగుతుందని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఐఐఎంల స్థాపనకు వాగ్దానం చేసిన రాష్ట్రాలలో పొరపాటున రాజస్థాన్ ను కూడా పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఈ విషయంలో అదనపు లబ్ధిదారుగా రాజస్థాన్ ను చేర్చడం వినా మార్గాంతరం లేకపోయింది. ఇక కొత్త ఎన్ఐటిలలో ఆరు సంస్థలు ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటవుతాయి. 374 మోడల్ కాలేజీలు దేశంలో విద్యాపరంగా వెనుకబడిన ప్రతి జిల్లాలో ఒకటి వంతున ఏర్పాటవుతాయి. పాఠశాలలో విద్యార్థుల నమోదు రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్న జిల్లాలు అవి.
Pages: -1- 2 News Posted: 10 June, 2009
|