బ్లాక్ విడో నేత స్త్రీల మోజు
ఒక చైనీస్ మహిళను సహచరిగా కలిగి ఉన్న హొజాయి ఒక ఆగ్నేయాసియా దేశంలో, బహుశా థాయిలాండ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. దక్షిణ అసోంలోని కచార్ జిల్లా దిమాసా గ్రామ వాసి అయిన గార్లొస్సా ఎన్ సి హిల్స్ కేంద్రం హఫ్లాంగ్ లో చదువుకున్నాడు. కాని గ్రాడ్యుయేట్ కాకముందే అతను చదువుకు స్వస్తి చెప్పాడు.
అతను పెయింటర్ లేదా సంగీతకారుడై ఉండేవాడని, కాని అజ్ఞాత ఉద్యమంలో చేరడానికి నిర్ణయించుకున్నాడని గూఢచారి శాఖ అధికారులు తెలిపారు. అతను హవాయి గిటార్ పై సంగీతాభ్యాసం చేసినట్లు తెలుస్తున్నది. బిజయ్ నైదుంగ్ అనే దిమాసా సిద్ధాంతకర్త ప్రేరణతో గార్లొస్సా, తదితరులు 1991లో దిమాసా నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ (డిఎన్ఎస్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. డిఎన్ఎస్ఎఫ్ నాయకులు చాలా మంది 1995లో లొంగిపోయారు. కాని గార్లొస్సా, మరొక తిరుగుబాటువాది దిలీప్ నునీసా ఆ సంస్థలో నుంచి నిష్క్రమించి డిహెచ్ డిని ఏర్పాటు చేశారు. నునీసా 2004 జనవరి 1న పోరు విరమణను ప్రకటించాడు.
అయితే, గార్లొస్సా 'బాహ్య ప్రపంచంలోకి' రావడానికి నిరాకరించి 2003లో డిహెచ్ డి-జెను ఏర్పాటు చేశాడు. 2004 నుంచి అతను, అతని బృందంలోని 150 మందికి పైగా తిరుగుబాటుదారులు అసోంలోను ఉత్తర కచార్ హిల్స్ జిల్లాపై పట్టును కలిగి ఉంటున్నారు. దిమాసా గిరిజనుల కోసం దిమారజీ ప్రత్యేక ప్రాంతాన్ని సృష్టించడం డిహెచ్ డి ప్రధాన లక్ష్యం.
Pages: -1- 2 News Posted: 11 June, 2009
|