లోక్ సత్తా జమాఖర్చు
రాష్ట్రంలో సంప్రదాయ పార్టీలు 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటాయని, అందులో 80 శాతం వరకూ ఓట్ల కొనుగోలుకే వెచ్చించారని జెపి ఆరోపించారు. లోక్ సత్తా అభ్యర్థుల సరాసరి వ్యయం లక్ష రూపాయల లోపే ఉందన్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వ నమోదు విధానం తాము ప్రవేశపెట్టామని, నెలకు రూ. 100 విరాళమిచ్చే ఈ సభ్యుల ద్వారా ఎక్కువ ఆదాయం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
కలిసివచ్చే పార్టీలతోనే గ్రేటర్ లో పొత్తు :
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు లోక్ సత్తా ఐదు నిర్దిష్ట హామీలతో ముందుకు వెళ్తోందని, అందుకు కలిసివచ్చే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తమకు అభ్యంతరం లేదని జెపి తెలిపారు. ఆ హామీలు ఇవి...
1) మంచినీటి సమస్య ఉన్నచోట రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అందరికీ బాటిల్డ్ వాటర్ అందించడం
2) సిటిజన్ ఛార్టర్లను ఏర్పాటు చేసి సకాలంలో ప్రజలకు సేవలు అందకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించే ఏర్పాటు. ఇలాంటి ఫిర్యాదుల కోసం అర్జీల అవసరం లేకుండా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు
3) ప్రతి డివిజన్ లో సమస్యలను గుర్తించి వంద రోజుల్లో, సంవత్సరంలో, ఐదేళ్ళల్లో పూర్తయ్య విధంగా పరిష్కారాలను గ్యారంటీ ఇవ్వడం
4) నగర పాలక సంస్థ పగ్గాలు లభిస్తే ప్రతి డివిజన్ కూ ఏటా రెండు కోట్లు ఇచ్చి స్థానికులు ఎన్నుకున్న కమిటీలకే స్థానిక సమస్యలు పరిష్కరించే అధికారం ఇవ్వడం. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ప్రతి డివిజన్ లో తలసరి వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చే ఏర్పాటు చేయడం.
5) మెట్రోపాలిటన్, వాటర్ వర్క్స్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ తదితర సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించి సాఫీగా ఒకేచోట పనులు జరిగే ఏర్పాటు. వీటన్నిటికీ కలిసి వచ్చి చిత్తశుద్ధితో ముందుకు వచ్చే పార్టీతో పొత్తుకు తాము సిద్ధమని జెపి ప్రకటించారు. ఈ హామీలను నెరవేర్చే సంకల్పం, సామర్ధ్యం, నిజాయితీ తమకు ఉన్నాయని జెపి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వి.విజయేంద్రరెడ్డి, ఎన్. రవీందర్ కూడా పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|