పొగరు తలకెక్కిందా!
తన ఆటతీరుతో ధనాధన్‌నే ఇంటిపేరుగా మార్చుకున్న ధోనీ ఇప్పుడు ఆస్థాయి ఆటను ఆడలేకపోతున్నాడు. కెప్టెన్సీ భారమో లేక ఇంకేమైన సమస్యలో గానీ... గత ఏడాదిగా తనశైలీకి భిన్నంగా ధోనీ ఆడుతున్నాడు. లార్డ్‌స వంటి బ్యాటింగ్ పిచ్‌పై పరుగులు చేయడానికే తంటాలు పడ్డాడు. 23 బంతులాడి 11 మాత్రమే చేసి మ్యాచ్‌ను చేజార్చాడు. పొట్టిక్రికెట్‌లో కెప్టెన్‌గా ముందుండి ఆడాల్సిన ఆటతీరు ఇదేనా ధోనీకే అర్థం కావాలి. యువరాజ్ మినహా జట్టులో ఏ బ్యాట్స్‌మెన్‌పై నమ్మకంలేదు. ఒకవేళ యూవీ కూడా విఫలమైతే పరిస్థితి ఏంటి!
ఆటగాళ్లు తప్ప ఓ అత్యున్నత జట్టుకు ఉండాల్సి ఏ లక్షణాలు భారత జట్టులో లేవు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లు తమ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థికి 20-30 పరుగులు తగ్గిస్తున్నారు. కానీ మనవాళ్లు చెత్త ఫీల్డింగ్‌తో 20-30 పరుగులు సమర్పించుకుంటున్నారు. అందకే ప్రత్యర్థి ముందు 180-200 పరుగులు టార్గెట్ ఇచ్చిన మానవాళ్లు కాపాడుకోవడం కష్టమే అవుతోంది. బ్రేవో 27 పరుగుల (19 బంతులు) వద్ద ఆడుతున్నప్పుడు అతన్ని అవుట్ చేసే అవకాశం వస్తే ధోనీ చేజేతులారా చేజార్చాడు. ఇదే మ్యాచ్‌ను ములుపుతిప్పింది. ఆ తర్వాత బ్రేవో17 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇదే కాకుండా మరో ఆరుబౌండరీలు, ఒక పరుగు వచ్చే దగ్గర రెండు పరుగులు మన ఫీల్డర్లు ఇచ్చుకున్నారు. ఈవన్నీ చూస్తే... నిజంగానే భారత్ చేజేతులారా తానే ఓడిందన్న విషయం అర్ధం అవుతోంది.
అయిందేదో అయింది. ఇక ఇప్పుటి వరకు జరిగిన తప్పిదాలను సవరించుకోకుంటే టోర్నీ లో ధోనీ సేన ప్రయాణం అర్థంతరంగా ఆగిపోక తప్పని పరిస్థితి వస్తుంది. అసలు పవర్‌ప్లేలో తొలి 36 బంతుల్లో కనీసం 50పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ మనకు కావాలి. ఎవరో ఒకరు ఆడుతారులే అనుకుంటే సరిపోదు... సమిష్టి ఆటనే సత్యాన్ని గుర్తించి త్వరగా మేలుకొని మిగిలిన రెండు మ్యాచుల్లో (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా)నెగ్గితే సెమీస్ చేరేందుకు అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీంమిండియా పుంజుకొని సత్తా చాటాలని ఆశిద్దాం.
Pages: -1- 2 News Posted: 13 June, 2009
|