`స్థానిక' కుస్తీకి సమాయత్తం
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపిటిసి, సర్పంచ్ ల నుంచి జడ్ పి చైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్ లు, మేయర్ల వరకు ప్రధాన పదవులను కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠ పరచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ గతంలో జడ్ పిటిసి ఉపఎన్నికలను కూడా జీవన్మరణ సమస్యగానే పరిగణించారు. అనుకూల ఫలితాలు సాధించని ఇద్దరు మంత్రులపై వేటు వేశారు.
కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు ఉన్నప్పటికీ వారిని రాజకీయంగా వినియోగించుకోలేకపోయారు. ఈ ఫలితాన్ని పిఆర్పీ ఎన్నికల్లో చవిచూసింది. స్థానిక ఎన్నికల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం పార్టీకి లభించింది. పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చుంటున్న తెలుగుదేశం కార్యకర్తల్లో నైరాశ్యం ఏర్పడకుండా స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంది. తిరిగి ముఖ్యమంత్రి కాగానే తొలి ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని వైఎస్ నిర్ణయించారు. ఎన్నికల బాధ్యతలు పూర్తయితే అధికారులు మిగిలిన నాలుగేళ్ళలో పూర్తిగా ప్రభుత్వ పథకాలకే పరిమితమౌతారు. వైఎస్ నిర్ణయం కాంగ్రెస్ కు ఆమోదయోగ్యంగానే ఉన్నప్పటికీ విపక్షాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఎన్నికలను సమర్ధవంతంగా ఢీ కొనక తప్పని పరిస్థితి ప్రతిపక్షాలకు ఏర్పడింది.
Pages: 1 -2- News Posted: 16 June, 2009
|