తెలుగుదేశం పిలుస్తోంది!
ప్రజారాజ్యంలోని టిడిపి నాయకుల నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోయినప్పటికీ టిడిపిలో మాత్రం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. విదేశీ పర్యటనకు వెళ్ళడానకి ముందు చంద్రబాబు కొంతమంది పార్టీ నాయకుల వద్ద ఈ అంశాన్ని విడివిడిగా చర్చించినట్లు తెలిసింది. జిల్లాల వారిగా టిడిపిలో బలమైన గ్రూపులు ఉండడం వల్ల పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు తిరిగి రావడంపై ఆ జిల్లా నాయకుల అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై చంద్రబాబు కొద్దిమంది నాయకులతో విచారిస్తున్నట్టు తెలిసింది. టిడిపి మాజీ నాయకులు ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ నాయకులను తిరిగి పార్టీలో చేర్పించే ప్రయత్నాలపై తనకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించినట్లు తెలిసింది.
శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రంన్నాయుడు ఈసారి రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచనలోఉన్నారు. దాంతో ఉత్తరాంధ్రకు చెందిన నాయకులను తిరిగి పార్టీలో చేర్పించుకుంటే తనకెలాంటి అభ్యంతరం ఉండదని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిడిపి నుంచి వెళ్ళిన వారిని తిరిగి పార్టీలో చేర్పించుకోవడం ద్వారా ఓట్ల చీలికని నివారించవచ్చుననేది టిడిపి వ్యూహం. ప్రస్తుతం గ్రామస్థాయి నాయకులను, నియోజకవర్గ స్థాయి నాయకులను తిరిగి పార్టీలోకి రప్పించడానికి ప్రయత్నిస్తామని టిడిపి నాయకులు తెలిపారు. ఇక ముఖ్యమైన నాయకులను మాత్రం కనీసం ఆరునెలల తర్వాత పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని టిడిపి నాయకులు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 June, 2009
|