అన్ని పార్టీలదీ అదే తీరు
క్రమశిక్షణకు తామే పేటెంట్ దారులమని గర్వంగా చెప్పుకునే వామపక్ష పార్టీలు తాజా ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి. సిపిఎం పరిస్థితి దారుణంగా తయారైంది. రద్దయిన అసెంబ్లీలో 9 సీట్లున్న సిపిఎంకు ఒక సీటు వచ్చినా, పార్టీ నాయకత్వంలో కించిత్ కూడా మార్పు కనపడకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లో తిరుగుబాటు ధోరణలు కనపడుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సిపిఎం తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబుతో దోస్తీ వద్దని చెవిలో ఇల్లు కట్టుకుని ఈ రెండు జిల్లాల నేతలు పోరినా, బివి రాఘవులు బాబుతో జతకట్టారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే సంకల్పం కంటే, ముఖ్యమంత్రి వైఎస్ అంటే వ్యక్తిగత ద్వేషంతో అనుసరించిన విధానాలు పార్టీకి శాపంగా మారాయని ఆ పార్టీ నాయకులే జనాంతిక సంభాషణల్లో చెబుతున్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. టిడిపితో జతకట్టేందుకు తాను వ్యతిరేకమని, తాను చెప్పినట్లు వింటే ఇంకా నాలుగు సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవని, బివి రాఘవులు మాటలు విన్న కొంత మంది పార్టీ సీనియర్ నేతల వల్లనే మహాకూటమిలో చేరాల్సి వచ్చిందని చెబుతున్నారు. సిపిఎం కంటే మూడు సీట్లు ఎక్కువ రావడంతో నారాయణ ఒడ్డున పడ్డారు. ఇక బిజెపి మళ్ళీ రెండు సీట్లకే పరిమితమైంది. బిజెపిలో కూడా సీనియర్ నేతల మధ్య అంతర్గతంగా యుద్ధం సాగుతోంది. అయితే తమ మధ్య ఉన్న విభేదాలు బయట పడకుండా బిజెపి నాయకులు జాగ్రత్త పడుతున్నారు. సినీనటుడు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేష్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా, తాజాగా ఆదిలాబాద్, కరీనంగర్ జిల్లాల్లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ పర్యటించినప్పుడు స్థానిక నాయకులు ఆయన సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. ఆదిలాబాద్ లో అయితే రెండు వర్గాల అనుచరులు రాళ్ళు, కుర్చీలతో పరస్పర దాడికి దిగారు.
Pages: -1- -2- 3 News Posted: 22 June, 2009
|