రాజీకి నై - పేచీకే సై
ఇంకా బెట్టువీడని అసమ్మతి నాయకులు మాత్రం కెసిఆర్ తో రాజీపడడానికి ససేమిరా అంగీకరించడం లేదని, కెసిఎఆర్ ఎలాగు తన కుమారుడితో రాజీనామా చేయించడానికి అంగీకరించరనే ఉద్దేశంతోనే వారా డిమాండ్ పెట్టి ఉంటారని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ముఖ్యమంత్రితో చేతులు కలపడం వల్లనే రాజీ పడటం లేదని టిఆర్ఎస్ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ జగన్ తో అసమ్మతి నేతల్లో ముఖ్యుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి సన్నిహిత సంబంధాలున్నాయని, దీంతో ఆయన మిగిలిన అసమ్మతి నేతలను రాజీ పడకుండా అడ్డుకుంటున్నారని టిఆర్ఎస్ అనుమానిస్తోంది.
అసమ్మతి నేతల్లో ముఖ్యులైన చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి వారు తిరిగి పార్టీలో చేరడంతో, మిగతా అసమ్మతి నేతలు పార్టీలోకి వచ్చినా రాకున్నా నష్టమేమీ లేదని టిఆర్ఎస్ భావిస్తుంది. తెలంగాణ విమోచన సమితిని స్థాపించిన మరో ముఖ్యనేత కపిలివాయి దిలీప్ కుమార్ తో పాటు ప్రకాశ్ ను కూడా తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు ముఖ్యలు అధినేత కెసిఆర్ కు సూచించినా ఆయన ససేమిరా అంగీకరించలేదని పార్టీ వర్గాల సమాచారం. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు దిలీప్ కుమార్ ఒఎస్ డిగా పని చేయడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయాలతోనే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన సమితిని దిలీప్ స్థాపించడం వెనుక వారి హస్తం ఉన్నట్టు తనకు సమాచారం ఉందని కెసిఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ కారణంతోనే దిలీప్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం లేదని వీరి కథనం.
Pages: -1- 2 News Posted: 29 June, 2009
|