వలస పక్షులు ఇంటిముఖం
ఎన్నికల్లో ఓడిపోయి పిఆర్పీలో తన ప్రాధాన్యం తగ్గాక తిరిగి తెదేపాలో చేరేందుకు కొత్తపల్లి ప్రయత్నిస్తుండడం పట్ల జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు ఆక్రోసం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా పిలిపించి సుబ్బారాయుడితో మంతనాలు జరిపి పార్టీని వీడి వెళ్ళవద్దని కోరారాని అయినప్పటికీ అదేమీ వినకుండా చివరి క్షణందాకా తాను తెదేపాలోనే కొనసాగుతానని చెప్పి అకస్మాత్తుగా పీఆర్పీలో చేరడం పట్ల తెదేపాలో ఇప్పటికీ సుబ్బారాయుడు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడుని పార్టీలోకి తీసుకోవాలా? వద్దా అన్న అంశంపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈలోపు జిల్లా నాయకులతో ఓ సారి ఈ విషయమై చర్చించాలని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పిఆర్పీకి కంచుకోటగా భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జిల్లా మాజీ తెదేపా అధ్యక్షుడు ఇటీవల ఎన్నికల్లో పిఆర్పీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూతో పాటు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ తదితరులు తిరిగి పాతగూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప ద్వారా వీరు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకుప్రయత్నానాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తిరిగి వీరిని పార్టీలో చేర్చుకునే అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్నారని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వీరి రాకను ఆహ్వానిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
గతంలో తెదేపాలో కీలక బాధ్యతలు నిర్వహించి పిఆర్పీ స్థాపించాక ఆ పార్టీలో చేరిన మాజీమంత్రి తమ్మినేని సీతారాం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నప్పటికీ సన్నిహితులు మాత్రం తెదేపాలో చేరాలని పట్టుబడుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రన్నాయుడు సీతారాం రాకను అడ్డుకోనని బయటకి చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు ఇప్పటికే పిఆర్పీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా తెదేపాలో చేరందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందించారని తెలిసింది.
Pages: -1- 2 -3- News Posted: 13 July, 2009
|