తొలి యాషెస్ టెస్ట్ డ్రా
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్ల ధాటికి 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా కాలింగ్ వుడ్ మాత్రమే నిలబడి ఆడాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. కాలింగ్ వుడ్ కు ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్ మాత్రమే కొంత సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ 23 ఓవర్ల వరకు ఆడగలిగారు. లేదంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసి ఉండేది. వీరి భాగస్వామ్యాన్ని జాన్సన్ బ్రేక్ చేశాడు. తర్వాత కాలింగ్ వుడ్ తో కలిసి బ్రాడ్ 17 ఓవర్లు ఆడాడు. ఆపై హౌరిట్జ్ తన మూడో వికెట్గా బ్రాడ్ ను అవుట్ చేశాడు.
కాని కాలింగ్ మంచి పోరాటపటిమను ప్రదర్శించి ఇంగ్లాండ్ ను ఓటమి అంచులనుంచి కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడికి రెండు లైఫ్ లు కూడా లభించాయి. హౌరిట్జ్ బౌలింగ్ లో బ్యాట్ అంచునుంచి లేచిన క్యాచ్ ను షార్ట్ లెగ్ లోని కటిచ్ అందుకోలేకపోయాడు. దీంతో కాలింగ్ వుడ్ మరింత జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడు లంచ్ విరామం అనంతరం పరుగులేమీ చేయకుండా సుమారు 31 బంతులు ఆడాడు. ఎట్టకేలకు 167 బంతులు ఎదుర్కొన్న కాలింగ్ వుడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేయగలిగాడు.
2004లో వెస్టిండీస్ పై నాజర్ హుస్సేన్ ఇదే తరహాలో స్లోగా హాఫ్ సెంచరీ సాధించగా ఆ తర్వాత నత్తనడక నడిచిన హాఫ్ సెంచరీ ఇదే. అయితే ఆనాటి హుస్సేన్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించింది. టీ విరామం అనంతరం పీటర్ సిడెల్ బౌన్సర్లు స్వాన్ ను గట్టిగా తాకడంతో ఫిజియో అవసరం ఏర్పడింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 435, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 9 వికెట్లకు 252. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 6 వికెట్లకు 674 డిక్లేర్డ్.
Pages: -1- 2 News Posted: 13 July, 2009
|